త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డొల్ల కంపెనీలు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కం గా నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ సమ్మిట్‌లో డొల్ల కంపెనీలు వ‌చ్చాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు.

a

News | Published On Dec 10, 2025, 7.21 pm IST

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డొల్ల కంపెనీలు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
Advertisement

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డొల్ల కంపెనీలు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కం గా నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ సమ్మిట్‌లో డొల్ల కంపెనీలు వ‌చ్చాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. ఆయా కంపెనీల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అప్పులున్నాయ‌ని తెలిపారు. క‌నీసం పెట్టుబ‌డి కూడా పెట్ట‌లేని కంపెనీలతో వేల కోట్ల రూపాయ‌ల ఒప్పందాలు ఎలా చేసుకుంటార‌ని దుయ్య‌బ‌ట్టారు. రేవంత్ పాల‌న‌తో హైద‌రాబాద్ దొంగ‌ల సిటీగా అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ వేదిక‌ల‌పైన తిర‌స్క‌ర‌ణ‌కు గురైన కంపెనీల‌తో ఏమ‌ని ఒప్పందాలు చేసుకుంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బుధ‌వారం (2025 డిసెంబ‌రు 10న‌) బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపాలిటీలు- కార్పొరేషన్ల విలీనం, నగర సమస్యలు, GHMC అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కీలక సమావేశాన్ని నిర్వహించిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కార్పొరేష‌న్ల విలీనానికి మేం వ్య‌తిరేకం
శివారు ​కార్పొరేషన్లను GHMCలో విలీనం చేయాలనే నిర్ణయానికి తాము వ్య‌తిరేక‌మ‌ని రాంచంద‌ర్ రావు చెప్పారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిల్లీ దండా అడుగుతున్న‌దని ఆయ‌న విమ‌ర్శించారు. శివారు మున్సిపాలిటీల ప్ర‌జ‌లు ఈ విలీనాన్ని అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. గ్రామాల్లో రైతుల‌ భూములు మార్పిడి జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. విలీనంపై అఖిల‌ప‌క్ష స‌మావేశం లేకుండానే ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించ‌కుండానే డివిజ‌న్‌లు పెంచుతూ పోవడాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఏ ప్రాతిప‌దిక‌న 300 డివిజ‌న్లు చేశారంటూ ప్ర‌శ్నించారు. క్విడ్ ప్రో కింద హైద‌రాబాద్ స్వ‌రూపాన్ని కాంగ్రెస్ మార్చే కుట్ర చేస్తున్న‌ద‌ని రాంచంద‌ర్‌రావు ఆరోపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement