MLA Yennam Srinivas Reddy | తెలంగాణ కొత్త ఆర్థిక ఇంజిన్ గా ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
MLA Yennam Srinivas Reddy | తెలంగాణ కొత్త ఆర్థిక ఇంజిన్‌గా భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath future city) మారుతుందని, పెట్టుబడులకు తెలంగాణ ఫస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ కొత్త ఆర్థిక ఇంజిన్‌గా భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath future city) మారుతుందని, పెట్టుబడులకు తెలంగాణ ఫస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 28 నెలల పాలనను పూర్తి చేసుకుందని తెలిపారు. రూ.24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్‌తో రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా పరుగులు పెట్టిస్తాం. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్‌కు కొత్త కళ వస్తుంది. టూరిజం, ఉపాధి, పెట్టుబడులకు కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణకు కొత్త ఆర్థిక ఇంజిన్‌గా మారుతుంది. ఫ్యూచర్ సిటీ ద్వారా పెట్టుబడులు, ఉపాధి, పరిశ్రమలకు కొత్త దారులు ఏర్పడతాయి. ఫ్యూచర్ సిటీని ప్రకృతికి అనుకూలంగా, గ్రీన్ ప్లానింగ్‌తో నిర్మిస్తున్నాం. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగర నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని యెన్నం చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతి...
UAE సహా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరుగుతోంది. పెట్టుబడుల కోసం తెలంగాణ ఫస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. గ్లోబల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. క్లీన్టెక్, ఐటీ, సేవలు, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడుల ఆసక్తి పెరుగుతోంది. 28 నెలల్లో కీలక రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడిలో పడింది. సాధారణ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వాహనాల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి అని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆర్థిక చలనాన్ని పెంచుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది. సుమారు రూ.10,000 కోట్ల వరకు మహిళలు ఆదా చేసుకున్నారు. ప్రజల చేతిలో డబ్బు మిగలడంతో మార్కెట్‌లో వినియోగం పెరిగింది. వేలాది కుటుంబాలకు ఉపాధి, చిన్న వ్యాపారాలకు ఊతం లభించింది. గృహజ్యోతి పథకం కింద 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతోంది. దీంతో ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ.600 వరకు ఆదా అవుతున్నాయి. గృహజ్యోతి ద్వారా వార్షికంగా సుమారు రూ.8,400 కోట్ల భారం తగ్గింది.
రేషన్ పథకంతో ఆయా కుటుంబాలకు దాదాపు రూ.16,200 కోట్లు ఆదా అయ్యాయి. తెలంగాణ జీడీపీ వృద్ధికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. 2,34,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లతో నిర్మాణ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అని ఎమ్మెల్యే యెన్నం వివరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



