Rathod Bapurao | తెలంగాణ జాగృతిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే చేరిక
Rathod Bapurao | కవిత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)లో చేరిక(Joins)ల పర్వం షురువైంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు.
Rathod Bapurao: త్రినేత్ర.న్యూస్: కవిత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)లో చేరిక(Joins)ల పర్వం షురువైంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో కవిత సమక్షంలో ఆయన జాగృతి కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కవిత బాపూరావుకు స్వాగతం పలికారు.
కవిత ముఖ్యమంత్రి కావాలి..
ఈ సందర్భంగా రాథోడ్ బాపూరావు మాట్లడారు. తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కవిత కావాలని ఆకాంక్షించారు. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో పెద్ద సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు ప్రాధాన్యం దక్కలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులొస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి బోథ్ నియోజకవర్గంలో పని చేశానని గుర్తు చేశారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని.. మూడోసారి తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. ఇక కవిత నాయకత్వంలో కొత్త పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు.
అడ్వకేట్ల చేరిక..
తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షులు అప్పల నరేందర్ ఆధ్వర్యంలో పలువురు అడ్వకేట్లు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



