Food Hub Sangareddy | సంగారెడ్డిలో రూ.650 కోట్లతో ఫుడ్ హబ్
Food Hub Sangareddy | సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో నిర్మించనున్నారు. మంత్రులు రేపు భూమి పూజ చేయనున్నారు.
- రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీ
- మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్–IIకి శ్రీకారం
- 1,500 మంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు
- జగ్గారెడ్డి, నిర్మల కృషితో ముందుకొచ్చిన ప్రాజెక్ట్
- సీఎం రేవంత్, మంత్రుల సహకారంతో తరలొచ్చిన పరిశ్రమ
- కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ లో కేజేఎస్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న శ్రీధర్ బాబు, దామోదర
- పాశమైలారం తర్వాత తొగర్‌పల్లిలో మరో భారీ యూనిట్
Food Hub Sangareddy | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో నిర్మించనున్నారు. KJS India Private Limited ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం తొగర్పల్లి–అలియాబాద్ ప్రాంతంలో “కేజేఎస్ యూనిట్–II” పేరుతో సమగ్ర ఆహార & పానీయాల తయారీ కేంద్రానికి రేపు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి భూమిపూజ చేయనున్నారు. దాదాపు 1,500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం పాశమైలారం యూనిట్‌లోనే వందలాది మహిళలు పనిచేస్తుండటం గమనార్హం.

సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడే పరిశ్రమ నెలకొల్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కోరారని, వారి కృషితోనే పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చామని పరిశ్రమ ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి సహకారంతో పరిశ్రమ స్థాపనకు వేగంగా అడుగులు పడ్డాయని చెప్పారు.

ఫుడ్ & FMCG హబ్‌గా సంగారెడ్డి..
కాన్ఫెక్షనరీ, బేవరేజెస్, కాఫీ, న్యూట్రాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలతో ఏర్పడనున్న ఈ యూనిట్ తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుందని నిర్మలా జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డి మహిళలకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పరిశ్రమ రావడం గర్వకారణమన్నారు. 1500 మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకట స్వామి ల సహకారం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



