First Survey map Registration | కుసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ : మంత్రి పొంగులేటి
First Survey map Registration | ఖమ్మం (Khammam) జిల్లా కుసుమంచి (Kusumanchi)లో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ (First Survey map Registration) జరగడం నవశకానికి నాంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇదొక చక్కని మార్గమని కొనియాడారు. సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారిస్తేనే రైతుకు భరోసా ఉంటుందన్నారు.
- భూ వివాదాల పరిష్కారంలో ఇదొక సువర్ణాధ్యాయం
- భూమి హక్కులకు శాశ్వత భరోసా
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం (Khammam) జిల్లా కుసుమంచి (Kusumanchi)లో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ (First Survey map Registration) జరగడం ఒక సువర్ణాధ్యాయం అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇదొక చక్కని మార్గం అన్నారు. రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉంటేనే అతని జీవితం భద్రంగా ఉంటుందన్నారు. ఈ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారిస్తేనే రైతుకు భరోసా ఉంటుందన్నారు. ఆపై నమ్మకం కలుగుతుందని చెప్పారు.
ఈనెల 2 నుంచి ప్రయోగాత్మకంగా అమలు..
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి తయారు చేసిన భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామన్నారు. ఈనెల 2 నుంచి నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు.
గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలో..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో మంగళవారం తొలి రిజిస్ట్రేషన్ చేసి నవశకానికి నాంది పలికామన్నారు. గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 156/ఇ/1 లోని ఎకరా నాలుగు గుంటల భూమిని, నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించారు. ఈ సందర్బంగా తన భూమి హద్దులతో కూడిన మ్యాప్ ను జత చేసి కుసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించి (భూ కమత పటము-1, భూధార్ నెంబర్ 795GCHDCUPJ7H0) ను తహసీల్ధార్ కేటాయించారు. సర్వే విషయంలో పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే పూర్తి చేయిస్తున్నామని జూపల్లి వివరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



