త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravankumar| బినామీల పేరుతో సీఎం బంధువుల సహజ వనరుల దోపిడీ..

బినామీల పేరుతో సీఎం రేవంత్ (CM Revanth) స‌ర్కార్ అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతుంద‌ని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravankumar) ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ (Fact finding team) తో క‌లిసి బుధ‌వారం కోకాపేట్ సమీపంలోని నియోపోలిస్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌ను సందర్శించిన‌ట్లు చెప్పారు.

S

News | Published On Mar 11, 2026, 4.11 pm IST

Dasoju Sravankumar| బినామీల పేరుతో సీఎం బంధువుల సహజ వనరుల దోపిడీ..
Advertisement

- జీవో 111ను తుంగలో తొక్కి అక్రమ క్రషింగ్
- ప్రభుత్వం, మైనింగ్ అధికారులు కుమ్మక్కు
- ఫ్యాక్ట్ ఫైండింగ్ స‌భ్యుల‌తో క‌లిసి భాగ్య‌ల‌క్ష్మి మిన‌ర‌ల్స్ క్ర‌షింగ్ యూనిట్ సంద‌ర్శించాం
- ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

త్రినేత్ర‌.న్యూస్‌: బినామీల పేరుతో సీఎం రేవంత్ (CM Revanth) స‌ర్కార్ అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతుంద‌ని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravankumar) ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ (Fact finding team) తో క‌లిసి బుధ‌వారం కోకాపేట్ సమీపంలోని నియోపోలిస్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌ను సందర్శించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ క్రషింగ్ యూనిట్ సీఎం రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులకు సంబంధించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొన్నారు.

నెల‌కు కోట్ల‌లో లాభం..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. మానస హిల్స్ (Manasa hills) లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) కి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషింగ్ యూనిట్‌ను పరిశీలించామ‌న్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టామని గుర్తు చేశారు. ఆ దృశ్యాలు ‘కేజీఎఫ్’ సినిమాను తలపించాయని, ఇప్పుడు నియోపోలిస్ ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు దానికంటే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌ (Bhaghyalakshmi minerals crushing unit) కు సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తప్ప ఇతర శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించారు. అయినప్పటికీ భారీ స్థాయిలో క్రషింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. నెలకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోందని, ఆ మొత్తం సీఎం బంధువుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు.

కోర్టుల‌కు వెళ్తాం..

జీవో 111 (GO 111) పరిధిలో చిన్న ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలకు అనుమతులివ్వని అధికారులు, అదే ప్రాంతంలో 17 ఎకరాల్లో భారీగా క్రషింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం పాలకులతో కుమ్మక్కైందా? అని నిలదీశారు. గుట్టలను కొల్లగొడుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ (Environment) విధ్వంసం జరుగుతున్నా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖ (Mining dept) లు ఎందుకు స్పందించడం లేదని ఫైర‌య్యారు. ఈ క్రషింగ్ యూనిట్ నుంచి తీసిన కంకరనే చుట్టుపక్కల నిర్మాణాలకు కొనుగోలు చేయాలని సీఎం ఫత్వా జారీ చేశారనే సమాచారం ఉందని చెప్పారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని, అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదిస్తామని హెచ్చ‌రించారు.

బోర్డులు మార్చేశారు.. ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) మాట్లాడుతూ.. పొంగులేటి క్ర‌షింగ్ సైట్ లో సిగ్గు లేకుండా రాఘవ కన్‌స్ట్రక్ష‌న్ బోర్డు (Raghava construction board) ను మార్చేశారని చెప్పారు. సీఎం, మంత్రులు త‌మ‌ ఆరోపణల పై తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. భాగ్యలక్ష్మి మినరల్స్ పేరిట పదెకరాలకు అనుమతి తీసుకుని పదిహేడు ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వానికి ఈ అక్రమ మైనింగ్ కనిపించడం లేదా అని ప్ర‌శ్నించారు. కాంట్రాక్టులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి బంధువులే ఉన్నారా ? కామారెడ్డి చేవెళ్ల డిక్లరేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ లకు నామినేషన్ పద్దతిన లీజులు ఇవ్వలేరా? మండిప‌డ్డారు.
రాజీవ్ యువ వికాసం అంటూ యువతను మోసం చేశారని పేర్కొన్నారు.

టీమ్ స‌భ్యులు వీరే..

ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ ఇన్‌చార్జ్ పటోళ్ల‌ కార్తీక్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ డా. మన్నె క్రిషాంక్, తెలంగాణ వైల్డ్‌లైఫ్ బోర్డు మాజీ సభ్యుడు ఎస్. రాఘవేందర్, ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యుడు జి. శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకుడు అభిలాష్ రంగినేని సభ్యులుగా ఉన్నారు.

Advertisement
Advertisement