Panchayat Elections | మొదటి విడతలోనే ప్రజలు రేవంత్ పాలనను ఘోరంగా తిరస్కరించారు: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) మొదటి విడత ఫలితాలు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాయని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) అన్నారు. మొత్తం 12,700 గ్రామపంచాయతీలలో మొదటి విడతగా జరిగిన 4,236 పంచాయతీల్లో సాధారణంగా అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) కే 90% వరకు అనుకూలత ఉండే పరిస్థితుల్లో కూడా బీఆర్‌ఎస్ 1,345 సర్పంచ్ స్థానాలు గెలవడం కాంగ్రెస్‌కు ప్రజలు జారీ చేసిన మొదటి భారీ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని పంచాయతీ ఫలితాలు స్పష్టంగా బట్టబయలు చేశాయని స్పష్టీకరణ
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) మొదటి విడత ఫలితాలు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాయని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) అన్నారు. మొత్తం 12,700 గ్రామపంచాయతీలలో మొదటి విడతగా జరిగిన 4,236 పంచాయతీల్లో సాధారణంగా అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) కే 90% వరకు అనుకూలత ఉండే పరిస్థితుల్లో కూడా బీఆర్‌ఎస్ 1,345 సర్పంచ్ స్థానాలు గెలవడం కాంగ్రెస్‌కు ప్రజలు జారీ చేసిన మొదటి భారీ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. తెలంగాణ (Telangana) భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కోతల నాటకానికి, వారి కోటరి ప్రలోభాలకు గ్రామీణ ఓటర్లు గట్టి ‘‘వాత’’ పెట్టారని, బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థులు భారీ ఒత్తిళ్లను, డబ్బు రాజకీయాలను తట్టుకుని నిలబడటం ప్రజాస్వామ్యానికి ధృవపత్రమని అభినందించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని పంచాయతీ ఫలితాలు స్పష్టంగా బట్టబయలు చేశాయని అభిప్రాయపడ్డారు.
సీఎం ఊరు కొండారెడ్డిపల్లి పక్కనే ఉన్న పోల్కంపల్లిలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం, సీతక్క నియోజకవర్గం ఏటూరు నాగారంలో బీఆర్‌ఎస్ గెలవడం, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళినాయక్ వదిన ఓడిపోయి ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకునే దుస్థితి రావడం ఇవన్నీ కాంగ్రెస్‌పై ప్రజల్లో ఎంత తీవ్రమైన అసహనం పెరిగిందో నిరూపిస్తున్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన అక్రమాల ద్వారా కాంగ్రెస్ గెలవడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరచడమేనని అన్నారు.
హామీలు అమలు చేయడానికి డబ్బులేదు అని చెప్పే రేవంత్ రెడ్డి, దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా ఎదిగి, జల్సా కార్యక్రమాలు, మ్యాచ్‌లు, ఇమేజ్ మేకింగ్ షోల కోసం వందల కోట్లు వెచ్చించడం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గమనిస్తున్నారని అన్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్‌ను ధ్వంసం చేసి ‘మెస్సీ వర్సెస్ మేస్త్రీ’ ఫుట్‌బాల్ ప్రదర్శన కోసం వంద కోట్లు ఖర్చు చేయడం, సింగరేణి నిధులను మళ్లించడం ప్రజల కష్టార్జిత ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని ఆయన ఖండించారు.
రెండో, మూడో విడతల్లో ఈ వ్యతిరేకత మరింత పెరిగి బయటపడుతుందని విశ్లేషించిన శ్రవణ్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా, సంఘటితంగా ముందుకు సాగి రాబోయే రెండు విడతల ఎన్నికల్లో ప్రజా తీర్పును మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ రాకేష్, మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



