త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rising |గ్లోబ‌ల్ సమ్మిట్ భేష్‌: రేవంత్‌కు డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయ కాంప్లిమెంట్స్‌

Telangana Rising | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజ‌య‌వంతం కావ‌డంపై ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని అభినందిస్తూ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Nori Dattatreyudu) సీఎంకు లేఖ రాశారు.

A

News | Published On Dec 12, 2025, 3.14 pm IST

Telangana Rising |గ్లోబ‌ల్ సమ్మిట్ భేష్‌:  రేవంత్‌కు డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయ కాంప్లిమెంట్స్‌
Advertisement

Telangana Rising | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజ‌య‌వంతం కావ‌డంపై ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Nori Dattatreyudu) అభినందించారు. ఈ మేర‌కు సీఎంకు లేఖ పంపించారు. స‌మ్మిట్ చారిత్రాత్మ‌క విజ‌యం సాధించింద‌ని తెలిపారు. రూ.ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రావ‌డం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల‌న‌, స్థిర‌త్వం, భ‌విష్య‌త్తుపై ఉన్న విశ్వాసానికి నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. డీప్ టెక్, గ్రీన్ ఎన‌ర్జీ, లైఫ్‌ సైన్సెస్ వంటి రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావ‌డం తెలంగాణ రైజింగ్ విజ‌న్ 2047 శ‌క్తికి నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ‌వేదికపై తెలంగాణ పోటీ ప‌డేందుకు తెలంగాణ రైజింగ్ విజ‌న్ 2047 ఉప‌యోగప‌డుతుంద‌న్నారు.

తెలంగాణ‌లో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, జీవ‌న ప్ర‌మాణాల పెంపు కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌స్తున్న పెట్టుబ‌డులు తెలంగాణ‌లోని ప్ర‌తి పౌరుడికి ప్ర‌పంచ స్థాయి వైద్యం అందేలా చేస్తాయని ఆకాంక్ష వ్య‌క్తం చేశారు. ప్ర‌జారోగ్యంలో మౌలిక స‌దుపాయ‌లు క‌ల్పించేందుకు పెట్టుబ‌డులు ఉప‌యోగ‌ప‌డ‌తాయని అభిప్రాయ‌ప‌డ్డారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయని చెప్పారు. ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్ ఫోర్త్ సిటీకి ర‌ప్పించి తెలంగాణ‌ను భార‌త దేశ స్టార్ట‌ప్‌గా, మాన‌వ కేంద్రీకృత అభివృద్దికి ప్ర‌పంచ కేంద్రంగా మారుతుంద‌ని ముఖ్య‌మంత్రి రుజువు చేశారని ప్ర‌శంసించారు. వ‌చ్చే నెల మూడో వారంలో రాష్ట్ర పర్యటన సమయంలో రేవంత్‌ను కలుసుకోవాలని భావిస్తున్న‌ట్లు చెప్పారు

 

Advertisement

తాజావార్తలు

Advertisement