త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | తెలంగాణ‌లో రెట్టింపు సంఖ్య‌లో అక్రిడిటేష‌న్లు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో గ‌తంలో కంటే ఈసారి రెట్టింపు (Double) సంఖ్య‌లో అక్రిడిటేష‌న్లు (Accreditations) మంజూరు చేస్తామ‌ని, ఇందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం 32,500 మందికి అక్రిడిటేష‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ 23,352 మందికే ప‌రిమితం చేసిందని విమ‌ర్శించారు.

S

News | Published On Apr 30, 2026, 5.08 pm IST

Ponguleti Srinivas Reddy | తెలంగాణ‌లో రెట్టింపు సంఖ్య‌లో అక్రిడిటేష‌న్లు: పొంగులేటి
Advertisement
  • అక్రిడిటేష‌న్ల సంఖ్య తేలితే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు  
  • మే 10 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
  • అన్ని జిల్లాల్లో రేపే అక్రిడిటేష‌న్ల పంపిణీ చేయాల‌ని క‌లెక్ల‌ర్ల‌ను ఆదేశించాం
  • ఇప్ప‌టికే 2,800 కార్డుల‌ను ఆమోదించాం
  • ఇప్పుడున్న బ‌స్సు పాసులు మే 15 వ‌ర‌కు పొడిగింపు
  • త్వ‌ర‌లో పాత్రికేయ సంఘాల‌తో భేటీ అవుతాం
  • రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో గ‌తంలో కంటే ఈసారి రెట్టింపు (Double) సంఖ్య‌లో అక్రిడిటేష‌న్లు (Accreditations) మంజూరు చేస్తామ‌ని, ఇందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆలోచ‌న మేర‌కు పాత్రికేయుల‌కు ఆరోగ్యంతో పాటు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. గురువారం స‌మాచార శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్టుల‌కు కొత్త అక్రిడిటేషన్ కార్డుల‌ను పొంగులేటి అంద‌జేసి మాట్లాడారు.

46 వేల మందికి పైగా అక్రిడిటేష‌న్లు..

దేశంలో, ఇతర రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న ఉత్త‌మ విధానాల‌ను ఇక్క‌డ అనుస‌రిస్తామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం 32,500 మందికి అక్రిడిటేష‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ 23,352 మందికే ప‌రిమితం చేసిందని విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేష‌న్లు ఇచ్చేలా మార్పులు చేసింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే సుమారు 2800 వ‌ర‌కు కార్డుల‌ను ఆమోదించామ‌ని వివ‌రించారు. జ‌ర్న‌లిస్టుల సూచ‌న‌ల మేరకు జీవోల‌లో మార్పులు చేర్పులు చేశామ‌న్నారు. అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కార్డుల మంజూరులో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. రేపు అన్ని జిల్లాల్లో అక్రిడిటేష‌న్ కార్డులు పంపిణీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు పొంగులేటి వివ‌రించారు.

సంస్థ మారినా అక్రిడిటేష‌న్లు ఇస్తం..

ఈ ప్ర‌క్రియ‌లో మే 10 వ‌ర‌కు క‌టాఫ్ డేట్‌గా పెట్టుకొని ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ఆ తేదీలోగా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదిస్తం. రాష్ట్రంలో అక్రిడిటేష‌న్లు సంఖ్య తేలితే జ‌ర్న‌లిస్టుల‌కు ఆరోగ్యం ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఒక ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశ‌గా ప‌లు సూచ‌న‌లు చేశారు. జ‌ర్న‌లిస్టులు వివిధ సంస్థ‌ల్లో ఉద్యోగాలు మారిన‌ప్ప‌టికీ అక్రిడిటేష‌న్ల మంజూరు ఓ నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగుతుంది. ఈ విష‌యంలో ఎటువంటి సందేహాలు వ‌ద్దు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో జర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. త్వ‌ర‌లో పాత్రికేయ సంఘాల‌తో భేటీ అవుతాం అని మంత్రి పేర్కొన్నారు.

ఏప్రిల్ 30తో కొంత‌మంది జ‌ర్న‌లిస్టుల బ‌స్సుపాస్‌ల గడువు ముగుస్తున్నందున మ‌రో 15 రోజుల పాటు పొడిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పొంగులేటి తెలిపారు. గురువారం ప‌లువురు పాత్రికేయుల‌కు ఆయ‌న‌ అక్రిడిటేష‌న్ కార్డుల‌ను అంద‌జేసి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, స‌మాచార శాఖ స్పెషల్ క‌మిష‌న‌ర్ ముకుంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement