Kishan Reddy | రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కిషన్ రెడ్డి
Kishan Reddy | తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పూర్తి చేసుకున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మోదీ సహకారంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- రూ. 200 కోట్లతో అభివృద్ధి
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పూర్తి చేసుకున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ. 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులా మారుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC) లో ప్రధాని మోదీ పాల్గొన్న సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోదీ సహకారంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
చాలా రోజుల తర్వాత మోదీ తెలంగాణకు వచ్చారని.. ఈ సందర్భంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కు ప్రారంభోత్సవం, జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితమే ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం అనుమతించిందన్నారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభించుకుంటామని వివరించారు. 2014 వరకు 2,400 కిలో మీటర్ల హైవేలు ఉంటే ఈ 11 ఏళ్లలో 2,600 కి.మీ. హైవేలు అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధికి పాటుపడుదాం. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధిలో ఎలాంటి వివక్ష లేకుండా పని చేస్తున్నాం. మోదీ హయాంలో 2047 వికసిత్ భారత్‌ను సాకారం చేసుకోవాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలతో పని చేస్తం అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



