రాహుల్ గాంధీ ఒక 420 బల్మూరి వెంకట్ ఒక పెద్ద దొంగ కోదండరాం కూడా మంచోడు కాదు రేవంత్ కొత్తగా ఇచ్చింది 5 వేల ఉద్యోగాలే 2 లక్షల ఉద్యోగాలివ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టం కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన నిరుద్యోగులు Telangana | త్రినేత్ర.న్యూస్ : ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి.. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వండి.. అని నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలు ఝలిపిస్తూ రాక్షసానందం పొందుతోంది రేవంత్ సర్కార్. జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహాధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. చిక్కడపల్లి లైబ్రరీకి పోలీసులు తాళం వేసి నిరుద్యోగులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ అభ్యర్థులు రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420 అని విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా.. మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు అని ధ్వజమెత్తారు. కోదండరాం కూడా మంచోడు అనుకున్నాం, కానీ వారు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారని నిప్పులు చెరిగారు. బల్మూరి వెంకట్ పెద్ద దొంగ.. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు అని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు పనికిమాలిన పాలన అని విమర్శించారు. నిరుద్యోగులకు మాటిచ్చి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిని గుడ్డలూడదీసి కొట్టాలా? అని ప్రశ్నించారు. నాది కొడంగల్.. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఉద్యోగాలు ఇవ్వక మా జీవితాలను నాశనం చేసిండు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా కేవలం 5 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అని తెలిపారు. తమ తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసమని ఇంత కష్టపడి చదివిపిస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు.. తమకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలాగా ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వక పోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అని నిరుద్యోగులు హెచ్చరించారు.