Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీంకోర్టులో ముగింపు
సుప్రీంకోర్టు (Supreme court) లో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defection MLA's) కేసు ముగిసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay karole) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 10 పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasadkumar) పరిష్కరించారని స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Abhishek singhvi) కోర్టుకు వివరించారు.
త్రినేత్ర.న్యూస్: సుప్రీంకోర్టు (Supreme court) లో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defection MLA's) కేసు ముగిసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay karole) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన మొత్తం 10 పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasadkumar) పరిష్కరించారని స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Abhishaik singhvi) కోర్టుకు వివరించారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రెండు రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణ ముగిసినట్లు (Concluded) అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు..
దానం నాగేందర్ (Daanam Nagendar), కడియం శ్రీహరి (Kadiyam Srihari) పార్టీ మారలేదని స్పీకర్ బుధవారం తీర్పు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ (BRS, BJP) తప్పు పట్టాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా ఇతరసాక్ష్యాలు ఉన్నప్పటికీ స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






