KTR | సిలిండర్ ధరల పెంపు మే డే కానుకనా మోదీ? తక్షణమే తగ్గించు: కేటీఆర్
KTR | చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు ప్రధాని మోదీ (PM Modi) మే డే కానుక ఇచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- సామాన్యుడు బతకొద్దా
- బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్లనూ వదిలిపెట్టవా
- ధరలు పెంచితే పకోడీలు కూడా వేసుకోలేం
- పెంచిన ధరలు వెంటనే వెనక్కి తీసుకోండి
- మోదీకి కేటీఆర్ డిమాండ్
KTR | త్రినేత్ర.న్యూస్: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా 1000 రూపాయలు పెంచి పేదలకు, కార్మికులకు ప్రధాని మోదీ (PM Modi) మే డే కానుక ఇచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరల (Cylinder Prices) ను భారీగా పెంచడంపై ఆయన స్పందించారు. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌నూ మోదీ వదల్లేదని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచుడు మోదీకి అలవాటేనన్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసే దుస్థితి..
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి 1000 రూపాయల సిలిండర్ ధరను బీజేపీ పెంచింది. పెంచిన సిలిండర్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. హోటళ్లలో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధిపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధరలు సంకటంగా మారాయి. మే డే (May Day) రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మే డే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారు. 1000 రూపాయల సిలిండర్ ధర పెరగడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. హైదరాబాద్‌లో 3,315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూసేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుంది అని కేటీఆర్ అన్నారు.
పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితి..
ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మోదీ, ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చాడు. చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ (Cess) పేరుతో 65 రూపాయలు ఉన్న పెట్రోల్‌ని రూ. 110-120 కి పెంచింది. ఇలా అడ్డగోలుగా పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నిటి ధరలు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఇంత భారీగా సిలిండర్ ధర పెంచితే సామాన్యుడు బతికేదెట్లా? ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేసి ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బ్యాచిలర్లు వాడే సిలిండర్లనూ వదల్లేదు..
ఇప్పటికే ఇరాన్ - అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌ను కూడా మోదీ వదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరలతో రోజువారీ టిఫిన్లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. మరోవైపు సిలిండర్ల ధర ఆకాశాన్నంటుతుంది అని విచారం వ్యక్తం చేశారు.
కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరల పెంపుపై చేయాల్సిన పోరాటాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలను వెనక్కి తీసుకోవాలి.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



