త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 87 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కే మెజారిటీ: CM రేవంత్‌రెడ్డి

| Revanth Reddy | రాష్ట్రంలో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో (Panchayat Elections) ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ (Congress)కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివ‌ర్ణించారు.

A

News | Published On Dec 18, 2025, 5.55 pm IST

Revanth Reddy | 87 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌కే మెజారిటీ: CM రేవంత్‌రెడ్డి
Advertisement

66 శాతం స్థానాలు గెలుచుకున్నాం
గ‌జ్వేల్‌లో సైతం స్థానిక ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అయిన తరువాత ఏ ఎన్నికల్లోనూ బీఆరెస్ గెలవలేదు
విలేక‌రుల స‌మావేశంలో వివ‌రించిన ముఖ్య‌మంత్రి

Revanth Reddy | రాష్ట్రంలో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో (Panchayat Elections) ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ (Congress)కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇవి రెండేళ్ల ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివ‌ర్ణించారు. ఎన్నికల్లో త‌మ‌కు సంపూర్ణ మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 12702 గ్రామ పంచాయతీలలో 7527 మంది కాంగ్రెస్, 808 మంది కాంగ్రెస్ రెబల్స్ నెగ్గారని చెప్పారు. 8335 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారని, ఇది మొత్త‌మ్మీద 66 అని పేర్కొన్నారు. బీఆరెస్ (BRS), బీజేపీ (BJP) కూటమిగా 33 శాతం, కమ్యూనిస్టులు 1 శాతం ఫలితాలు సాధించార‌న్నారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు.

మెజారిటీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టం కాంగ్రెస్‌కే...

రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగిన 94 శాసనసభ నియోజవర్గాల్లో 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించిందని సీఎం చెప్పారు. బీఆరెస్ ఆరు నియోజవర్గాల్లో, బీజేపీ ఒక‌ నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయన్నారు. కేసీఆర్ (KCR) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ స్థానిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేసీఆర్‌ను తిర‌స్క‌రించార‌ని అన్నారు.

సంక్షేమ ప‌థ‌కాలే శ్రీ‌రామ‌ర‌క్ష‌...

పేద‌ల‌కు తాము అందిస్తున్న సన్నబియ్యం, ఉచిత కరెంటు, సన్న‌ వడ్లకు బోనస్, రూ.500 కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన త‌దిత‌ర‌ పథకాలు అమ‌లు చేస్తున్నామ‌న్న రేవంత్ అవే త‌మ‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారాయని, అందుకే ప్రజలు మమ్మల్ని ఆదరించారని వివ‌రించారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించామ‌ని, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామ‌ని చెప్పారు. హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా మేం నిర్ణయం తీసుకోలేదన్నారు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడు వ్యవహరించలేదని, ఈ ఫలితాలు మాపై మరింత బాధ్యతను పెంచాయని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమ‌ని చెప్పారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా కేటీఆర్ విఫ‌లం...

బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా కేటీఆర్ (KTR) విఫ‌ల‌మ‌య్యార‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం నుంచి వ‌చ్చిన ఏ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ విజ‌యం సాధించ‌లేద‌ని చెప్పారు. మ‌రోవైపు కేటీఆర్‌ను తప్పించాలని హరీశ్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందన్నారు. అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారని తేల్చారు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదని మండిప‌డ్డారు. మూసీలో కాలుష్యం కంటే ఎక్కువ విషం ఒకాయన కడుపులో కనిపిస్తోందని, ఈ ఫలితాలు చూసే అద్భుతం అని కొందరు జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చామ‌ని, ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరని అన్నారు. 2029 లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

కృష్ణా జ‌లాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నాన‌ని, ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాస్తే కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్‌, కేసీఆర్ లేన‌ని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహం ఆధారాలతో సహా నిరూపిస్తామ‌ని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళతామ‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement