Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లొదిలి కాంగ్రెస్ డ్రామాలు: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
Niranjan Reddy |గత రెండేళ్లలో ఏపీ అతి ఎక్కువగా నీళ్లను తరలిస్తే, తెలంగాణ అతి తక్కువగా వాడుకున్నది, కృష్ణా జలాల్లో (Krishna water) కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మంగళవారం ఆయన మీడియా(Press meet) తో మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సీఎం ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.
. ఆంధ్రాకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకున్నాడు
. ఇండెంట్లు లేకుండా నీటిని తరలిస్తుంటే కాంగ్రెస్ చొద్యం చూస్తోంది
. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు రేవంత్ ఎందుకు అడగరు?
. కిషన్‌రెడ్డి, బండి ఎందుకు ప్రశ్నించరు?
. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిలకు కృష్ణా జలాలే శరణ్యమని తెలియదా?
. చేతనైతే ఢిల్లీలో, అమరావతిలో ధర్నా చేయండి
త్రినేత్ర.న్యూస్: గత రెండేళ్లలో ఏపీ అతి ఎక్కువగా నీళ్లను తరలిస్తే, తెలంగాణ అతి తక్కువగా వాడుకున్నది, కృష్ణా జలాల్లో (Krishna water) కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మంగళవారం ఆయన మీడియా(Press meet) తో మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సీఎం ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. సీఎంకు పెళ్లిళ్లు, పేరంటాలు, ఢిల్లీ ప్రయాణాలు తప్ప ఏపీకి వెళ్లి ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని.. చేతనైతే ఢిల్లీలో, అమరావతిలో ధర్నా చేయండని సవాల్ విసిరారు.
సాగునీటి రంగంలో తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు. నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. నోటికాడికి వచ్చే బుక్క నేలపాలవుతుంది. రైతుల కష్టార్జితం నాశనం అవుతుంది. తెలంగాణ నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. ఎలాంటి ఇండెంట్లు లేకుండా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. సర్కార్ నడుపుతున్నారా ? సర్కస్ నడుపుతారా ? అని ఫైరయ్యారు.
కిషన్‌రెడ్డి, బండి ఎందుకు ప్రశ్నించరు?
కేంద్రం పరిధిలో ఉన్న కేఆర్ఎంబీ తెలంగాణకు చేస్తున్న అన్యాయం గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కనాడు కూడా ఎందుకు ప్రశ్నించరు? తెలంగాణకు సాగునీటిలో జరుగుతున్న అన్యాయం మీద ఒక్కనాడు ఎందుకు అడగరు, ఏపీ ప్రభుత్వం ఇంటర్ బేసిన్ ట్రాన్స్ ఫర్ కు వ్యతిరేకంగా కృష్ణా బేసిన్ లో లేని హాంద్రి నీవా, పెన్నా బేసిన్, గాలేరు నగరికి తరలిస్తున్నది. ఇప్పుడు బనకచర్లతో ముందుకు గోదావరి జలాలు కృష్ణాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోయింది..
ఈ ఏడాది దాదాపు 45 రోజులు ఆలస్యంగా ఎత్తిపోతల పంపులు ప్రారంభించారు. ఈ ఏడాది అత్యధికంగా కృష్ణా నదికి వరదలు వచ్చాయి. సాగునీరు ఎత్తి పోసుకోకపోవడమే కాకుండా ఏపీ జల దోపిడీని నిరోధించలేకపోయారు. రెండు వారాల ముందే హెచ్చరించినా ఈ ప్రభుత్వం మేలు కోలేదు. సాగునీటి దోపిడీని అడ్డుకోకుండా ఇప్పుడు పంటలు ఎండిపోయే ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీశైలం వద్ద తీరిగ్గా ధర్నా చేస్తున్నారు. ఎస్సెల్బీసి కూలిపోతే కనీసం అందులో ఇరుక్కున్న శవాలను బయటకు తీయలేదు. వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే ఒక్క రోజు కూడా వెళ్లి పరిశీలించలేదు. వట్టెం పంప్ హౌస్ పర్యటన పెట్టుకున్న నీటిపారుదల శాఖ మంత్రి అక్కడి వరకు రాకుండా మధ్యలోనే వెళ్లిపోయారు అని మండిపడ్డారు.
నీళ్లు మలుపుకునే చేతకాదు...
10 శాతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఆరు నెలల్లో రూ.1200 కోట్లతో పూర్తి చేసి ఉంటే నేడు జిల్లాలోని రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది. నీళ్లు మలుపుకునే చేతగాక, వెళ్లిపోయిన నీళ్ల కోసం శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ముంటే, ప్రజలు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, పదవీలాలస లేకుంటే మిగిలిపోయిన పాలమూరు పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. లేదంటే పదవులు వదులు కోవాలి అని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఐదు పంపులు నడిపితే సరిపడా నీరు..
చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ధర్నా పేరుతో షో చేస్తున్నారు. కేఎల్ఐ ఎత్తిపోతలను సక్రమంగా వాడితే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. రిపేరులో ఉన్న రెండు పంపుల మరమ్మతులకు రూ.10 కోట్లు ఇవ్వకుండా రెండేళ్లుగా పెండింగులో పెట్టారు. 5 పంపులు నడిపితే సమృద్ధిగా నీరు వాడుకోవచ్చు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా భీమా, జూరాల ఆయకట్టుకు కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వలు రద్దు చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలను తీసుకువచ్చారు.
ఉన్న నీళ్లనూ వాడుతలేరు..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కొడంగల్, నారాయణపేట ప్రాంతాల్లో లక్ష 30 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ డిజైన్ చేశారని.. రేవంత్ రెడ్డి 60 వేల ఎకరాలకు ఒక్క పంటకే నీటిని తెచ్చేలా డిజైన్ చేశారని మండిపడ్డారు. ఉన్న నీళ్లను వాడుకోకుండా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేయకుండా పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి రైతులకు ఈ సర్కారు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపి రెండేళ్లయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు....
ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు సీఎంలుగా ఉన్నారు. శిష్యుడికి సలహాదారు ఆంధ్రా నుంచి వచ్చిన అధికారే ఆదిత్యనాథ్ దాస్. ఇక జెన్ కో, రెడ్కో, ట్రాన్స్ కో కు కూడా ఆంధ్రా అధికారులను తీసుకువచ్చి వారికింద తెలంగాణ ఉద్యోగులను పనిచేయిస్తున్న దుస్థితి నెలకొంది. పాలమూరు అవసరాల కోసం 55 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో కనీసం 20 నుండి 25 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లు నిర్మించలేదు. 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న పాలమూరుకు కాంగ్రెస్ చేసిన పాపం ఇది.
పాలమూరు ఎత్తిపోతల కింద కేసీఆర్ 70 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించారు. పనికిరాదన్న పాలమూరు ఎత్తిపోతలకు రేవంత్ రెడ్డి తన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దాని నుంచి చేపట్టనున్న రూ.1800 కోట్ల డిండి పనులు రేవంత్ తమ బావమరిదికి ఇచ్చుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టు దగ్గర ధర్నా చేయడం విచిత్రం. చేతనైతే ఢిల్లీలో, అమరావతిలో ధర్నా చేయండి. ఇక్కడ డ్రామాలు ఆపండి. పాలమూరు రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





