త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekend drunk and drive | వీకెండ్ డ్రంక్ అండ్‌ డ్రైవ్ లో 138 మందిపై కేసులు: డీసీపీ

Weekend drunk and drive | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive)లో భాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామ‌ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ (Traffic DCP Ranjan Rathan Kumar) తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 138 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు (Filed cases) చేసిన‌ట్లు చెప్పారు.

S

News | Published On Mar 29, 2026, 12.39 pm IST

Weekend drunk and drive | వీకెండ్ డ్రంక్ అండ్‌ డ్రైవ్ లో 138 మందిపై కేసులు: డీసీపీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive)లో భాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామ‌ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ (Traffic DCP Ranjan Rathan Kumar) తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 138 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు (Filed cases) చేసిన‌ట్లు చెప్పారు. 121 ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 11 కార్లు, 1 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయ‌ని పేర్కొన్నారు.

బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే 116 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 15 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 7 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ తీసుకొని పట్టుబడ్డార‌న్నారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం నేరమని డీసీపీ పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ఈ నేరానికి 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. గత వారంలో మొత్తం 403 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయ‌ని పేర్కొన్నారు.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement