KTR | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. సీరియల్ కిల్లర్స్ మాదిరి రేవంత్‌ది సీరియల్ స్నాచర్స్ ప్రభుత్వం అని విమర్శించారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి 100 ఎకరాల భూమిని తీసుకున్నారు.. అక్కడ విద్యార్థులు ఆందోళన చేసినా కూడా అక్కడ హైకోర్టు కడుతామని చెప్పారు. అలాగే హెచ్‌సీయూలో కూడా 400 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారు.. అందులో 10 వేల కోట్ల కుంభకోణం ఉందని నిర్ధారణ అయితే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఒకవేళ హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఉర్దూ యూనివర్సిటీ భూములు కబ్జాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు.. వాళ్ల దగ్గర కూడా 100 ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారు. రాజ్యసభలో ఉర్దూ యూనివర్సిటీ భూములపై మాట్లాడతాం అని కేటీఆర్ తెలిపారు. చేతకాని సన్నాసి రాహుల్ గాంధీ.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఎందుకు ఇచ్చావు. రెండేళ్లు గడిస్తే ఇంతవరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైందని పిల్లలు రోడ్డెక్కితే వాళ్లను ఇష్టమొచ్చినట్లు గొడ్లను కొట్టినట్లు కొట్టి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి అటు పక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ పోతున్నాడని భయంతో అరెస్టులు మీద అరెస్టులు చేయిస్తున్నాడు అని కేటీఆర్ మండిపడ్డారు. మళ్ళీ రెండున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి మేము నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం. మేము మనూ విద్యార్థులకు మద్దతుగా ఉంటాం.. ఢిల్లీలో పోరాటం చేయడానికి కూడా మీతో కలిసి వస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.