Vakiti Srihari | ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలవి అబద్ధాలు.. పాలమూరులో మధ్యలోనే వదిలేశారు
90 శాతం తమ ప్రభుత్వమే ప్రాజెక్టులు పూర్తి చేసిందని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboobnagar) జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు.
- సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి
త్రినేత్ర.న్యూస్: 90 శాతం తమ ప్రభుత్వమే ప్రాజెక్టులు పూర్తి చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. హైదరాబాద్ (Hyderabad) లోని ఎర్రమంజిల్ జలసౌధలో రాష్ట్ర సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar reddy) అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboobnagar) జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు. మక్తల్ - నారాయణపేట-కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతులకు 99శాతం భూములకు నష్ట పరిహారం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూరాల ప్రాజెక్టు (Jurala project) లో సిల్ట్ తొలగించకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ పంప్ హౌస్‌లు పూర్తి చేస్తే...
పాలమూరు–రంగారెడ్డి (Palamuru-Rangareddy) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భూత్పూర్, సంగనబండ, పంప్ హౌస్‌లతో పాటు సర్జీపూర్ పంప్ హౌస్ (Pump house) ను కూడా పూర్తి చేయాలని చెప్పారు. సర్జీపూర్ పంప్ హౌస్ పూర్తియితే మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు తక్కువ సమయంలో ఎక్కువ నీటిని సరఫరా చేయవచ్చని వివరించారు. ప్రాజెక్టుల గేట్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు వృథాగా పోతుందని వాపోయారు. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల పొలాలకు పారాల్సిన నీరు, వృథా అవుతోందన్నారు. భూత్పూర్, సంగనబండ గ్రామాల ప్రజలు 6 వేలకు పైగా ఎకరాలు భూమి ఇచ్చారని, వారికి పరిహారం ఇవ్వక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంగనబండ పంప్ హౌస్ కు సంబంధించి కర్ణాటక రైతులు (Karnataka formers) 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు పరిహారం ఇస్తే సంగనబండ పంప్ హౌస్ ను మరింత సరళతరం చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల గేట్ల పర్యవేక్షణ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు.
తాజావార్తలు
- ●Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం
- ●CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ
- ●Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్
- ●Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి
- ●GST Council | సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం
- ●NCLT Subhash Chandra | అప్పు రూ.22 వేల కోట్లు.. చెల్లించేది రూ.6 కోట్లే: NCLT పై రాహుల్ ఫైర్, అసలు జీ గ్రూప్ వివాదం ఏంటి?

Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం

CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ

Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్

Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి






