త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ప్రాజెక్టుల కోసం రూ.లక్షల‌ కోట్లు ఖర్చు చేసినా.. అన్న‌దాత‌లకు అంద‌ని సాగు నీరు: కవిత

Kavitha | రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. 12 ఏండ్ల‌లో రెండు పార్టీల ప్ర‌భుత్వాలు రూ.2.20 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశాయ‌ని, అయిన‌ప్ప‌టికీ సాగు నీరు అంద‌క అన్న‌దాత‌లు అరిగోస ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Apr 20, 2026, 11.47 am IST

Kavitha | ప్రాజెక్టుల కోసం రూ.లక్షల‌ కోట్లు ఖర్చు చేసినా.. అన్న‌దాత‌లకు అంద‌ని సాగు నీరు: కవిత
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. 12 ఏండ్ల‌లో రెండు పార్టీల ప్ర‌భుత్వాలు రూ.2.20 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశాయ‌ని, అయిన‌ప్ప‌టికీ సాగు నీరు అంద‌క అన్న‌దాత‌లు అరిగోస ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఎండల తీవ్రత పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయన్నారు. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి రాష్ట్ర‌వ్యాప్తంగా రైతులు నానా తంటాలు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద, నానక్ నగర్, మంతన్ గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని చెప్పారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.వెయ్యికి పైగా చెల్లిస్తున్నార‌ని, ఇలా వరి, కూరగాయల పంటలను రక్షించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఒక మహిళా రైతు తన పంట చేతికి రావాలంటే నీళ్ల ట్యాంకర్లకే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల దుబారా పనులకు అద్దం పడుతున్న‌ద‌ని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement