KTR | కూలింది కాళేశ్వరం కాదు.. కుట్రలు, కుతంత్రాలు కూలిపోయాయి : కేటీఆర్
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు, కుతంత్రాలు కూలిపోయాయని కేటీఆర్ అన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలు, కుతంత్రాలు కూలిపోయాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు తీర్పు చూసిన తర్వాత.. నిజం నిలకడ మీదే తేలుతుంది.. నిజం కడప దాటే లోపల అబద్దం అంగీలాగా వేసుకుని ప్రపంచమంతా తిరిగి వస్తుందనే తెలుగు సామెత నిజమైంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచాలు అయిందిని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అబద్దాలతో అద్భుతాలైన నిజాలను చాలా కాలం వరకు దాచలేరు. కాళేశ్వరం మహత్యాన్ని కూడా కనబడకుండా దాచలేరు.
అబద్దానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్షు తక్కువ. రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్యారేజీ మీద నిలబెట్టి.. అక్కడనున్న పర్రెను చూపెట్టి కొట్టుకుపోయిందని చిల్లర ప్రయత్నం చేశారో అది అబద్దమని తేలింది. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిన దూర్తులకు గువ్వ గూయ్‌మనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చింది. హైకోర్టుకు మా పార్టీ పక్షానా.. తెలంగాణ రైతాంగం పక్షానా ధన్యవాదాలు.
అభండాలు వేసి ఇష్టమొచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులకు హైకోర్టు చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చింది. ఇవాళ రైతులు, ప్రజలు గెలిచారు. కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ ఓడిపోయింది.. కక్ష కట్టినట్టుగా మూడేండ్లుగా చేస్తున్న చిల్లర ప్రచారాలు కూలిపోయాయి. కాళేశ్వరం కూలింది.. కుంగింది అంటూ ప్రచారం చేసిన పిట్టల దొరలకు ముఖం పగిలే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్రలు, కుటిల ప్రయత్నాలు కూలిపోయాయి. మీరు సిగ్గు విడిచి ఆడిన అబద్దాలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మోసపూరిత గారడీ కూలిపోయింది. సత్యవమేవ జయతే అనే నిజం నిరూపితమైంది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు.. అన్ని రోజులు అందర్నీ మోసం చేయలేమని ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ మీద బురదజల్లి, రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు.. కానీ నిప్పు లాంటి నిజం బయటకు వచ్చింది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తప్పుడు పని చేస్తే ఊరుకోమనేది ఈ తీర్పు ద్వారా వెల్లడైంది.
ఒకటి మాత్రం వాస్తవం. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎవర్నీ తెచ్చి వాదించినా.. ఎన్ని కమిషన్లు వేసినా.. కుట్రలు చేసినా ఎంత అబద్దాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా.. పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గొప్పతనానికి సాక్ష్యం. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అజరామం. భూమి ఉన్నంత కాలం కాళేశ్వరం ఉంటుంది. ఈ గోదావరి నది పారినంతా కాలం ప్రాజెక్టు చరిత్రను తాకలేరు అని సీఎంకు చెప్తున్నా అని కేటీఆర్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



