త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Leaders | ఒక్క ఎక‌రాకు కూడా సీఎం నీళ్లివ్వ‌లేదు.. రేవంత్‌పై పాల‌మూరు నేత‌ల ఫైర్

BRS Leaders | రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక అహంకార పూరిత ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల కింద ఒక్క ఎక‌రాకు కూడా నీరు ఇవ్వ‌లేద‌ని తెలిపారు.

S

Telangana | Published On Apr 15, 2026, 3.28 pm IST

BRS Leaders | ఒక్క ఎక‌రాకు కూడా సీఎం నీళ్లివ్వ‌లేదు.. రేవంత్‌పై పాల‌మూరు నేత‌ల ఫైర్
Advertisement

BRS Leaders | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక అహంకార పూరిత ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల కింద ఒక్క ఎక‌రాకు కూడా నీరు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాద‌వ్, హ‌ర్ష‌వర్ధ‌న్ రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జైపాల్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది : జైపాల్ యాద‌వ్

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాద‌వ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కల్వకుర్తిలో జరిగిన సభలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టారు. పాలమూరు ప్రాజెక్టుతో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి చర్యలతో జైపాల్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది. జైపాల్ రెడ్డి పేరును, ప్రతిష్టలను సీఎం రేవంత్ రెడ్డి వాడుకున్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు వేస్తోంది. పాలమూరు బిడ్డ సీఎం అని చెప్పుకోవడంలో అర్ధం లేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పట్టింపు లేదు. రేవంత్ రెడ్డికి పాలమూరును అభివృద్ధి చేసే గొప్ప అవకాశం వచ్చింది. సీఎం కాగానే రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు అని మండిప‌డ్డారు.

ఇష్టానుసారంగా ఇసుక ర‌వాణా : బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలను రేవంత్ రెడ్డి గందరగోళానికి గురి చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఇసుక రవాణా ఇష్టానుసారంగా జరుగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న పెంట్లవెల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా వెనుక ఉన్న రాజకీయ పెద్దలు ఎవరు..? మంత్రి జూపల్లి కృష్ణారావు నీతులు మాట్లాడతారు. చిన్న ఇళ్ళు కట్టుకుందామని ఇసుక తెచ్చుకుంటే ట్రాక్టర్లను పట్టుకుంటున్నారు. జిల్లాలో ఇసుక దోపిడీని సీఎం ఆపాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆఫ్ లైన్ దోపిడీ జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్ పార్టీ : ఆళ్ల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గఫ్లత్‌గా ఎమ్మెల్యే అయ్యాడు. దేవరకద్రకు పట్టిన శని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేతిలో ప్రజ‌లు మోస‌పోయారు. పాలమూరు జిల్లా నుంచి సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని ఓట్లు వేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయడం లేదు. హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టుల కోసం కృషి చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. రెండున్నరేళ్లుగా మధుసూదన్ రెడ్డి టెంకాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చి తన స్వంత గ్రామంలో ఇథ‌నాల్ ఫ్యాక్టరీ పక్కన పెడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కేసులు పెట్టడంలో గోల్డ్ మెడల్ ఇవ్వవచ్చు. కేసులు పెడుతామని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. రెండున్నరేళ్లు తిట్లతోనే సరిపోయింది అని ఆళ్ల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement