త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchandar Rao | మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు త‌ప్పు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

తాము తొలిసారిగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేశామ‌ని తొలి విడ‌త ఎన్నిక‌ల్లో దాదాపుగా 300 కు పైగా స్థానాలు గెలిచామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్ రావు తెలిపారు.

a

News | Published On Dec 13, 2025, 5.41 pm IST

N Ramchandar Rao | మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు త‌ప్పు: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
Advertisement

త్రినేత్ర‌ న్యూస్ : తాము తొలిసారిగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేశామ‌ని తొలి విడ‌త ఎన్నిక‌ల్లో దాదాపుగా 300 కు పైగా స్థానాలు గెలిచామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్ రావు తెలిపారు. స‌ర్పంచ్ ఫ‌లితాల్లో బీజేపీ చాలా త‌క్కువ చోట్ల గెలిచిందంటూ మీడియాలో ఇచ్చిన గ‌ణాంకాలు, వ‌చ్చిన క‌థ‌నాలు త‌ప్ప‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేవ‌లం సర్పంచు స్థానాలే కాకుండా ఎక్కువ సంఖ్య‌లో ఉప స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్ స్థానాలు గెలుచుకున్నామ‌ని వెల్ల‌డించారు. తొలి విడ‌త గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన సంద‌ర్భంగా శ‌నివారం (2025 డిసెంబ‌రు 13) న ఆయ‌న మీడ‌యాతో మాట్లాడారు. ఇంత‌కు ముందు ఎన్న‌డూ బీజేపీ ..గ్రామ‌పంచాయతీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించలేద‌ని ఈ సారి మాత్ర‌మే పోటీలో నిలిచామ‌ని రాంచంద‌ర్‌రావు చెప్పారు. ప్ర‌తి జిల్లాలో మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ఇందుకు కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై గ్రామీణ వాసుల‌కు న‌మ్మ‌కం ఉండ‌డ‌మేన‌ని తెలిపారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు మ‌ళ్లించి అవి త‌మ ప‌థ‌కాలుగా చెప్పుకోవ‌డం విడ్డూర‌మ‌ని విమ‌ర్శించారు. ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ్ స‌డ‌క్ యోజ‌న కింద విడుద‌ల‌వుతున్న నిధుల ద్వారానే గ్రామాల్లో ర‌హ‌దారులు నిర్మాణం అవుతుంటే..వాటిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఖాతాలో వేసుకుంటున్న‌ద‌ని చెప్పారు. ఉచితంగా 5 కిలోల బియ్యం, వైకుంఠ‌ధామాలు వంటివ‌న్నీ కేంద్ర‌ప్ర‌భుత్వ నిధుల‌తో అమ‌ల‌వుతున్న‌యేన‌ని వెల్ల‌డించారు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీతో తాము చేసిన తొలి ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాల‌నిచ్చింద‌ని చెప్పారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు గెలిస్తే.. వారికి కండువాలు క‌ప్పి త‌మ పార్టీ వారిగా చెప్పుకుంటున్నార‌ని తెలిపారు.

కాంగ్రెస్‌-బీఆర్ ఎస్ ఇద్ద‌రూ తోడుదొంగ‌లే

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ ఇద్ద‌రూ తోడు దొంగ‌ల‌నేన‌ని వారి ఉమ్మ‌డి శ‌త్రువు బీజేపీ యేన‌ని రాంచంద‌ర్ రావు విమ‌ర్శించారు. పైకి ప్ర‌త్య‌ర్థులుగా న‌టిస్తున్నా ఆ రెండు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న ఉన్న‌ద‌ని ఎద్దేవా చేశారు. పార్ల‌మెంట‌రీ స్థానాల డీలిమిటేష‌న్‌పై ఈ ఏడాది మార్చి 5న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి డీకే స్టాలిన్.. రాజ‌కీయ పార్టీల‌తో ఏర్పాటు చేసిన చ‌ర్చ‌కు అటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ ఎస్ నుంచి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హాజ‌ర‌య్యార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాదు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ కూడా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వీరిద్ద‌రినే క‌లిశార‌ని, వీరంద‌రికీ ప్ర‌త్య‌ర్థి బీజేపీయేన‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement