త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Y Sathish Reddy | బీజేపీ అంటే బేటీ బచావో కాదు.. బేటీ భక్షణ: రెడ్కో మాజీ చైర్మ‌న్ స‌తీశ్‌రెడ్డి

Y Sathish Reddy | బీజేపీ (BJP) అంటే బేటీ బచావో కాదని.. బేటీ భక్షణ అని అలాగే నారీ శక్తి అంటే నారీకి శాపం అని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌ రెడ్డి విమ‌ర్శించారు. బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు ఘటనతో ఇది మరోసారి స్పష్టమైంద‌న్నారు.

S

News | Published On May 10, 2026, 2.49 pm IST

Y Sathish Reddy | బీజేపీ అంటే బేటీ బచావో కాదు.. బేటీ భక్షణ: రెడ్కో మాజీ చైర్మ‌న్ స‌తీశ్‌రెడ్డి
Advertisement
  • మహిళలపై నేరాల్లో బీజేపీ టాప్‌లో ఉంది
  • 44 మంది బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులున్నాయి
  • ఇప్పుడు అదే జాబితాలోకి బండి సంజయ్ కొడుకు
  • యూపీలో సెంగర్, కర్నాటకలో ప్రజ్వల్ రేవణ్ణ, ఢిల్లీలో బ్రిజ్ భూషణ్, ఇప్పుడు తెలంగాణ
  • బీజేపీలో ఎక్కడ చూసినా వేధింపులే
  • కాషాయ పార్టీపై రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌ రెడ్డి ఆగ్రహం

Y Sathish Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ (BJP) అంటే బేటీ బచావో కాదని.. బేటీ భక్షణ అని అలాగే నారీ శక్తి అంటే నారీకి శాపం అని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌ రెడ్డి విమ‌ర్శించారు. బీజేపీ అంటేనే మహిళల వ్యతిరేకి అని.. మహిళల పాలిట ఒక పిశాచంగా మారిందని.. బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు ఘటనతో ఇది మరోసారి స్పష్టమైంద‌న్నారు. తెలంగాణ బీజేపీలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని.. గతంలో స్వయంగా ఓ బీజేపీ నాయకురాలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్ప‌టి నుంచి మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. ఓ వైపు బేటీ బచావో.. నారీ శక్తి అని చెప్పుకుంటున్నారు. కానీ బేటీ బచావో అంటూ భేటీ భక్షణ చేస్తున్నారు. నారీశక్తి అని చెప్పుకుంటూ.. ఆ నారీమణులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. బండి సంజయ్ కొడుకు ఘటనతో ఇది మరోసారి స్పష్టమైంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్.. ఓ బాలికను లైంగికంగా వేధించడంతో కేసు నమోదైంది. కరీంనగర్ లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గతంలో బీజేపీ మహిళా నాయకురాలితో అభ్యంతరకరంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి అని పేర్కొన్నారు.

మ‌హిళ‌ల‌ను వేధించిన‌ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ కోసం ప్ర‌ధాని ప్రచారం..

కేవలం తెలంగాణ‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా బీజేపీలో ఇదే పరిస్థితి ఉంది. పేరుకు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. దేశానికి గొప్ప పేరు తెచ్చిన.. ఒలింపిక్ లో మెడల్స్ తెచ్చిన రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ అనే కాంగ్రెస్ ఎంపీ లైంగికంగా వేధించారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినా కేంద్రంలోని బీజేపీ సర్కారు చర్యలు తీసుకోలేదు. ఇక ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగర్, ఆయన అనుచరులు.. ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. అయినా ఆయనపై బీజేపీ చర్యలు తీసుకోలేదు. అలాగే.. కర్నాటకలో దాదాపు 3000 మందిని లైంగికంగా వేధించిన ప్రజ్వల్ రేవణ్ణ కోసం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక బిల్కిస్ బానో కేసులో.. నిందితులు జైలు నుంచి విడుదలయ్యాక.. బీజేపీ నాయకులు వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి సన్మానం చేశారు అని రెడ్కో మాజీ చైర్మ‌న్‌ ఫైర‌య్యారు.

దేశ భ‌క్తుల‌మ‌ని చెబుతూ దాడులు..

ఇలా మహిళలపై బీజేపీ నేతల అకృత్యాలు.. వారిని ఆ పార్టీ నాయకత్వం వెనకేసుకు రావడం.. ఇవన్నీ సర్వసాధారణమ‌య్యాయి. ఓ వైపు మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం.. మహిళా బిల్లు పార్లమెంట్ లో పెట్టామని చెబుతున్న బీజేపీ.. మరోవైపు.. వారిపై లెక్కలేనన్ని దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు మహిళలపై నేరాలకు సంబంధించి 44 మంది బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో మహిళలపై నేరాలు 31 శాతం పెరిగాయి. బీజేపీ నాయకులు ఓ వైపు.. దేశభక్తులమని.. హిందూ పరిరక్షకులమని చెప్పుకుంటూ.. మరోవైపు.. ఆడబిడ్డలపై అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటి బీజేపీకి ప్రజలు.. ఆడబిడ్డలు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి అని స‌తీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement