Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సేకు లక్కీ ఛాన్స్ – కల్కి నిర్మాతలతో లేడీ ఓరియెంటెడ్ మూవీ
Bhagyashri Borse | తెలుగులో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్యపాన నిషేదం నాటి కథతో ఫన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భాగ్యశ్రీ బోర్సే
Bhagyashri Borse | సినీ పరిశ్రమలో హిట్టుకే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. సక్సెసుల్లో ఉన్నవారి చుట్టే ఇండస్ట్రీ తిరుగుతుంది. ఫ్లాపుల్లో ఉన్న వారిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఒక్క ఫ్లాప్ ఎదురైతే చాలా నెక్స్ట్ సినిమా అవకాశం రావడమే కష్టమవుతుంది. హీరోయిన్ల విషయంలో నాలుగైదు ఫ్లాప్‌లు ఎదురైతే వారిపై ఐరెన్ లెగ్ అంటూ ముద్రలు వేస్తారు. వారి కెరీర్ ముగిసినట్లేనంటూ విమర్శలు గుప్పిస్తుంటారు.
కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పరాజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్, ఇమేజ్‌తో దూసుకుపోతుంటారు. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటుంటారు. భాగ్యశ్రీ బోర్సే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి(Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో నాలుగు సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ వంటి స్టార్ హీరోలతో జోడి కట్టింది. గ్లామర్‌తో పాటు యాక్టింగ్ తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సేకు లక్కు మాత్రం కలిసిరాలేదు. భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన కింగ్డమ్‌తో పాటు కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా డిజాస్టర్స్‌గా నిలిచాయి.
బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చినా ఈ అమ్మడి జోరు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని లెనిన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా భాగ్యశ్రీ బోర్సే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి రమేష్ ఎలిగేటి దర్శకత్వం వహించబోతున్నాడు. మద్యపాన నిషేదం కాలం నాటి కథతో ఫన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగులతో కలిసి కల్కి నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
ప్రస్తుతం లెనిన్ షూటింగ్‌తో బిజీగా ఉంది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం హైదరాబాద్‌లో అఖిల్, భాగ్యశ్రీపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
తెలుగులో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్యపాన నిషేదం నాటి కథతో ఫన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



