త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | జ‌న‌గ‌ణ‌న‌లో భాగస్వాములు కండి: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం పిలుపు

CM Revanth Reddy | జ‌న‌గ‌ణ‌న‌లో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ భాగస్వాములు కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన (Census 2027) లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొని వెబ్‌సైల్‌లో త‌న వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు.

S

News | Published On Apr 26, 2026, 3.49 pm IST

CM Revanth Reddy | జ‌న‌గ‌ణ‌న‌లో భాగస్వాములు కండి: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం పిలుపు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌న‌గ‌ణ‌న‌లో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ భాగస్వాములు కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన (Census 2027) లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొని వెబ్‌సైల్‌లో త‌న వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు సంబంధించిన వివరాలను సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. జనగణనలో అందరూ భాగం కావాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలను పార‌ద‌ర్శ‌కంగా అందించేందుకు ఈ గ‌ణ‌న ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌న్నారు. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంకా ఆల, ఐ అండ్ పీఆర్‌ కమిషనర్ సీహెచ్.ప్రియాంక, ఉన్నతాధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement