త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Womens Protest | బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలి.. అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద భారీ నిర‌స‌న

BRS Womens Protest | బండి భ‌గీర‌థ్‌ను అరెస్టుకు సంబంధించి నిర‌స‌న‌లు రోజురోజుకు తీవ్ర‌రూపం దాల్చుతున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడు బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) పై బీఆర్ఎస్ మ‌హిళా లోకం మ‌రోసారి భ‌గ్గుమంది. సీఎం డౌన్ డౌన్‌, బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలి అనే నినాదాల‌తో ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాలు ద‌ద్ద‌రిల్లాయి.

S

News | Published On May 15, 2026, 11.57 am IST

BRS Womens Protest | బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలి.. అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద భారీ నిర‌స‌న
Advertisement

BRS Womens Protest | త్రినేత్ర‌.న్యూస్‌: బండి భ‌గీర‌థ్‌ను అరెస్టుకు సంబంధించి నిర‌స‌న‌లు రోజురోజుకు తీవ్ర‌రూపం దాల్చుతున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడు బండి భ‌గీర‌థ్‌ (Bandi Bhagirath) పై బీఆర్ఎస్ మ‌హిళా లోకం మ‌రోసారి భ‌గ్గుమంది. బాలిక‌పై వేదింపుల‌కు పాల్ప‌డిని పోక్సో కేసు నిందితుడు భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని మ‌హిళ‌లు నినాదాల‌తో హోరెత్తించారు. సీఎం డౌన్ డౌన్‌, బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలి అనే నినాదాల‌తో ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాలు ద‌ద్ద‌రిల్లాయి. బండి సంజ‌య్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని బీఆర్ఎస్ మ‌హిళా నాయ‌కురాళ్లు ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు.

 

అంత‌కుముందు ప్ల‌కార్డులు చేత‌బూని మ‌హిళా నాయ‌కురాళ్లు భారీ సంఖ్య‌లో ట్యాంక్‌బండ్ విగ్ర‌హం వ‌ద్ద‌కు చేరుకున్నారు. విగ్ర‌హ ఆవ‌ర‌ణ‌లోకి వెళ్లి అక్క‌డే బైఠాయించారు. శాంతియుతంగా నిర‌స‌న తెలిపారు. బండి భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోదైనా ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. నిందితుడిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాపాడుతోంద‌ని, వెంట‌నే సీఎం స్పందించి అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డికి పోలీసులు భారీ సంఖ్య‌లో చేరుకుని శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న బీఆర్ఎస్ మ‌హిళా నాయ‌కురాళ్ల‌ను పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు స్టేష‌న్లకు త‌ర‌లించారు. సైఫాబాద్‌, నాంప‌ల్లి, అఫ్జ‌ల్‌గంజ్ పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Advertisement
Advertisement