BJP Chief Ramchandar Rao | అప్పుడు టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్.. మళ్లీ పుట్టిన బిడ్డ టీఆర్ఎస్ అంట: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యలు
BJP Chief Ramchandar Rao | గతంలో టీఆర్ఎస్(TRS), ఇప్పుడు బీఆర్ఎస్(BRS).. మళ్లీ దానికి పుట్టబోయే బిడ్డ టీఆర్ఎస్ అంట అని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. కవిత (Kavitha) పార్టీ ఏర్పాటుపై శనివారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నా బీజేపీ(BJP)కి నష్టం లేదన్నారు.
BJP Chief Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: గతంలో టీఆర్ఎస్(TRS), ఇప్పుడు బీఆర్ఎస్(BRS).. మళ్లీ దానికి పుట్టబోయే బిడ్డ టీఆర్ఎస్ అంట అని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. కవిత (Kavitha) పార్టీ ఏర్పాటుపై శనివారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నా బీజేపీ(BJP)కి నష్టం లేదన్నారు. తెలంగాణను పాలించిన వారంతా దోచుకోవడానికే సరిపోయారని ఆరోపించారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తం..
పార్టీ కార్యాలయంలో శనివారం పండిట్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీతోనే తెలంగాణ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం నిర్మాణమై ఉంది. ఈ ఐక్యత, కార్యకర్తలు సిద్దాంతాల పట్ల నిబద్ధత, పని చేసే ఉత్సాహంతో కలిసి పని చేస్తే రేపటి రోజు తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో ఒక కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పెట్టడం కాదు. ఏ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తదనే విషయాన్ని మనం ఆలోచించాలి అని ఆయన సూచించారు.
12 ఏండ్లుగా అవినీతి రహిత పాలన...
ఈ దేశంలో భాజపా అవినీతి రహిత పాలన అందిస్తున్నది. 12 సంవత్సరాలు భారత్‌ను నడిపిస్తున్న ప్రధాని మోదీ హయాంలో ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెచ్చు ఈరోజు మనం తెలంగాణ చూస్తున్నం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్లీ దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ యే అంట. వీళ్లందరూ రాష్ట్రానికి ఏం చేయలేదు. కేవలం తెలంగాణను దోచుకోవడానికే సరిపోయారు అని విమర్శలు గుప్పించారు.
మీరు దోచుకుంది ఇవ్వండి..
మా మంత్రుల సగం సాలరీ ఇస్తమని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటుండు. ఎన్నిరోజులు ఇస్తరు? ఎంతిస్తరు.. మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటది. సాలరీలు కాదు మీరియ్యాల్సింది. మీరు మీ సెంట్రల్ పార్టీకి వెయ్యి కోట్లు ఇస్తమంటున్నరు కదా.. దాంట్లో ఎంప్లాయి వెల్ఫేర్‌కు రూ.500 కోట్లు ఇవ్వండి. కొంతమంది జీవితాల్లోనైనా వెలుగులు వస్తాయి. అవినీతి రహిత పాలన కోసం ప్రజల ముందున్న ప్రత్యామ్నాయ పార్టీ భాజపానే. కష్టపడి పని చేస్తే అధికారం మనదే అన్న విశ్వాసంతో ముందుకెళ్దాం అన్ని కార్యకర్తలకు రాంచందర్‌రావు సూచించారు.
ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నా.. తెలంగాణ కోసం అసలైన పోరాటం చేసింది బీజేపీయే. రాష్ట్ర సాధనకు ఆరోజు ముందున్నది బీజేపీ. ఆనాడు కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని పార్లమెంటుకు వెళ్లారు. బీజేపీ కష్టపడి పని చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది అని బీజేపీ చీఫ్ వ్యాఖ్యనించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



