BRS | సమ్మిట్ జరుగుతుండగానే కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలివెళ్లాయి: మన్నె క్రిశాంక్
BRS | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఒకవైపు జరుగుతండగానే మరోవైపు కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలివెళ్లాయని బీఆర్ఎస్ (BRS) నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర ఆరోపణలు చేశారు.
BRS | ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టాహాసంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఒకవైపు జరుగుతండగానే మరోవైపు కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలివెళ్లాయని బీఆర్ఎస్ (BRS) నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. సమ్మిట్ జరుగుతుండగానే సిగాచి, విరూపాక్ష ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు తరలివెళ్లాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కష్టపడి తీసుకువచ్చిన ఫాక్స్‌కాన్ పరిశ్రమను తీసుకువస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్తరించలేక పక్క రాష్ట్రానికి తరలిపోయిందని వివరించారు. కీన్స్, కార్నింగ్ వంటి ప్రసిద్ధ సంస్థలు సైతం వేరే రాష్ట్రాలకు మరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కమిషన్లు, కాంట్రాక్టులతో ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 'రెండేళ్ల లో కమిషన్లు, కాంట్రాక్టులు, కాంగ్రెస్ పార్టీ' పుస్తకాన్నిగురువారం ఆవిష్కరించారు. అనంతరం క్రిశాంక్ విలేకరులతో మాట్లాడుతూ రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని, ఆ సొమ్మంతా వృథాయేనని ధ్వజమెత్తారు. విజన్ డాక్యుమెంట్ ఛాట్ జీపీటీలో తయారు చేశారని ఆరోపించారు. సమ్మిట్‌కు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ సైతం తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రమని, కేసీఆర్ పాలనను ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిందని దువ్వూరి సుబ్బారావు చెబుతుండగా, రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ ప్రచారం చేస్తున్నారని నిప్పలు చెరిగారు.
ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 13 వేల ఎకరాల భూసేకరణ చేస్తే కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ అవే భూముల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరితో పెట్టుబడిదారులు సైతం కన్ఫ్యూజన్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
ఒకవైపు వాంతారా జూ పార్క్‌ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్ వ్యతిరేకిస్తున్నారని, కానీ అదే వాంతారా జూ పార్క్‌కు వెయ్యి ఎకరాలు కేటాయించేలా రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ నోరు తెరిస్తే అంబానీ, అదానీ అంటూ మాట్లాడుతుంటాడని, మరి రేవంత్‌రెడ్డి చేసుకున్న ఒప్పందాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ రెండు నాల్కల ధోరణితో ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు.
సమ్మిట్‌లో చూపుతున్న ఒప్పందాలన్నీ బోగస్‌వేనని క్రిశాంక్ ఆరోపించారు. సరిగ్గా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఎస్ఎల్ఆర్ సురభి అనే కంపెనీ కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారని, అలాంటి కంపెనీ రూ. మూడు వేల కోట్లు ఎలా పెట్టుబడులు పెడుతుందని ప్రశ్నించారు. రూ.150 కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన స్వంత అన్నకు చెందిన స్వచ్చ బయో కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై భూకబ్జా కేసు నమోదైందని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో రేవంత్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడుల్లో రెండు శాతం వాస్తవ రూపం దాల్చినా రాష్ట్రానికి మేలే జరుగుతుందని బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి అన్నారు. ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు విశ్వసనీయత లేనివేనని ఆరోపించారు. ప్రజల సొమ్ము దుబారా చేశారని, వారం రోజులు ,నెల రోజుల ముందు పుట్టిన కంపెనీలతో ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పరిశ్రమల ముసుగులో ఆర్థిక అక్రమాలు చేస్తున్న కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో షెల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని అన్నారు. రూ. లక్షా 74 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని గతంలో ప్రభుత్వం చెప్పుకుందని, వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది రూ. తొమ్మిది వేల కోట్లేనని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలు అన్నింటిపై సమగ్ర విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హరీశ్‌రెడ్డి, కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



