Samreen Kaur | పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రేమాయణం.. ఎవరీ సమ్రీన్ కౌర్?
Samreen Kaur | పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. దాంతో ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Samreen Kaur | పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. దాంతో ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోల్లో అర్ష్‌దీప్ ఓ యువతి చేతిని పట్టుకుని కనిపించాడు. ఆమె ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. పలువురు నెటిజన్లు ఫొటోల్లో కనిపించిన టాటూ ఆధారంగా ఆమె పంజాబీ నటి సమ్రీన్ కౌర్‌గా గుర్తించారు.
Arshdeep Singh Snap Story.
ਕੀ ਪਤਾ ਵਿਆਹ ਕਰਾ ਕੇ ਕੋਈ ਸਿਆਣਾ ਬਣ ਜਾਵੇ. #PunjabKings pic.twitter.com/kPZ7VfbQBl
— Gurtej Singh (@GGurtej) April 5, 2026
ఫొటోల్లో ఉన్న టాటూతో పోలిస్తే అలాగే కావడంతో మిస్టరీ గర్ల్ ఆమెనే కావొచ్చన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా సమ్రీన్ కౌర్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా న్యూ చండీగఢ్ స్టేడియంలో ఆమె కనిపించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు సైతం ఆమె హాజరైనట్లు తెలుస్తోంది. సమ్రీన్ కౌర్ పంజాబీ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పంజాబ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
So Arshdeep Singh is also committed !! pic.twitter.com/49Lvtm275S
— Vihaan. (@Vihaann96) April 5, 2026
వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన వివరాలను అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల 83 మూవీలో నటించింది. ఈ మూవీ కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ సాధించిన 1983 వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇదిలా ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు. జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం అందుకునే టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముందువరుసలో ఉన్నాడు.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






