CM Revanth Reddy | ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించండి: గవర్నర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గవర్నర్ (Governor) శివ ప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో ఆదివారం కలిశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించారు.
త్రినేత్ర.న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గవర్నర్ (Governor) శివ ప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో ఆదివారం కలిశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీల(MLC's) పేర్లు ఆమోదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రొ.కోదండరామ్ (Kodandaram), మాజీ క్రికెటర్ అజారుద్దీన్(Azaharuddin) పేర్లు ఆమోదించాలని కోరారు.
అజారుద్దీన్ ఏ సభలో సభ్యుడు కానప్పటికీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. అయితే ఆరు నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండడం తప్పనిసరి కాగా ఫైల్ పై సంతకం చేయాలని సీఎం రేవంత్ గవర్నర్ ను కోరారు. ఒకవేళ గవర్నర్ సీఎం ప్రతిపాదనను ఆమోదించకపోతే ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆలోపే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఓ వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల్లోపు అసెంబ్లీ లేదా మండలికి తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు. ఒకవేళ గవర్నర్ కోటా కాకపోతే ఖాళీగా ఉన్న ఏదైనా ఎమ్మెల్సీ స్థానం, స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని మండలికి పంపాలి. ఇది కూడా ఫలించకుంటే మంత్రి పదవి కోల్పోక తప్పదు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



