త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yashki Goud | నామినేటెడ్ ప‌ద‌వుల్లో ‘సేవాదళ్‌’కు స‌ముచిత స్థానం: మధుయాష్కి గౌడ్

Madhu Yashki Goud | నామినేటెడ్ ప‌ద‌వు (Nominated positions) ల్లో సేవాద‌ళ్ (Seva Dal) కార్య‌క‌ర్త‌ల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్తాన‌ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన‌ సేవాదళ్ కార్యకర్తల కృషి మరువలేనిద‌న్నారు.

S

News | Published On May 1, 2026, 4.14 pm IST

Madhu Yashki Goud | నామినేటెడ్ ప‌ద‌వుల్లో ‘సేవాదళ్‌’కు స‌ముచిత స్థానం: మధుయాష్కి గౌడ్
Advertisement
  • కాంగ్రెస్‌కు సేవాద‌ళ్ పునాది వంటిది
  • స్వాతంత్య్ర పోరాటంలో సైనికుల్లా ప‌ని చేశారు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మత విభ‌జ‌న‌ రాజకీయాలకు చెక్ పెడ‌దాం
  • స‌మ‌ర్థ్ శిక్ష‌ణ శిబిరంలో మధుయాష్కీ గౌడ్ పిలుపు

Madhu Yashki Goud | త్రినేత్ర‌.న్యూస్‌: నామినేటెడ్ ప‌ద‌వు (Nominated positions) ల్లో సేవాద‌ళ్ (Seva Dal) కార్య‌క‌ర్త‌ల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్తాన‌ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ 'సమర్థ్-శిక్షణ శిబిరం' కార్యక్రమానికి శుక్రవారం ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. సేవాదళ్ కార్యకర్తల గౌరవ వందనం స్వీకరించిన అనంత‌రం ప్ర‌సంగించారు.

అప్పుడు సైనికుల్లా ప‌ని చేశారు..

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ పునాది లాంటిది. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ నేటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. దేశ స్వాతంత్ర పోరాటంలో సేవాదళ్ పాత్ర మరువలేనిది. దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను బలంగా తీసుకెళ్లిన సేవాదళ్ కార్యకర్తలు స్వాతంత్రం కోసం సైనికుల్లా పని చేశారు. ఇందులో పని చేసిన జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా దేశానికి సేవ‌లు అందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సేవాదళ్ కార్యకర్తలు తమ సొంత డబ్బులు వెచ్చించి పార్టీ విధానాలను ప్రజల్లో తీసుకెళుతున్నారు అని మ‌ధుయాష్కీ చెప్పారు.

అధికారం రావ‌డంలో సేవాద‌ళ్ కృషి..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన‌ సేవాదళ్ కార్యకర్తల కృషి మరువలేనిది. వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవులను కేటాయించి వారికి సమచిత గౌరవం ఇవ్వాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మత విభజన రాజకీయాలకు చెక్ పెట్టే శక్తి సేవాదళ్ కు ఉంది. ఆ దిశగా సేవాదళ్ కార్యకర్తలు మరింత కృషి చేయాలి అని ఆయ‌న సూచించారు.

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ.. సేవాదళ్ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో, క్యాంపు కోఆర్డినేటర్ దేవేందర్ శర్మ, ఏఐసీసీ కోఆర్డినేటర్ సమాద్ జీ, ప్రతినిధులు తేళ్ళ శ్రవణ్ కుమార్, అప్సర్ యూసఫ్, గోవింద్ రావు, వాజీడ్ మెహక్, మంకాల దాస్, అంజిరెడ్డి, బండి సురేందర్, రేణు కుమార్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, వాజీద్ బాషా, నీలకంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement