Student suicide | గురుకులంలో మరో విద్యార్థి ఆత్మహత్య.. అంత పిరికివాడు కాదంటున్న తల్లి
Student suicide | మహబూబాబాద్ (Mahaboobabad) జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి రావు పూలే కాలేజీ (Mahatma Jyothiba Phule)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Student suicide | త్రినేత్ర.న్యూస్: గురుకుల కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి రావు పూలే కాలేజీ (Mahatma Jyothiba Phule) లో చోటుచేసుకుంది. మృతుడిని భూపాలపల్లి (Bhupalapally) జిల్లా గోరికొత్తపల్లికి చెందిన రచర్ల కార్తీక్ (Karthik) (19)గా గుర్తించారు. తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మృతిపై తల్లిదండ్రుల అనుమానం..
తన కొడుకు చిన్నప్పటి నుండి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్లో సీసీటీవీ పనిచేయడం లేదని, తాము వచ్చే సరికే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారని ఆగ్రహించారు. ఈ సమయంలో ఆత్మహత్య అని ఎలా నిర్ధారణకు రావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారిడి మృతిపై అనుమానం ఉందన్నారు. నమ్మి ఇక్కడికి పంపామని, ఎలా చనిపోయాడో తమకు తెలియాలని పట్టుబట్టారు. గొంతు మీద ఎటువంటి గాయాలు లేవని, ఆత్మహత్య అని ఎలా నమ్మాలని నిలదీశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 132 మంది గురుకుల విద్యార్థుల మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



