త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | తీన్మార్‌ మ‌ల్ల‌న్న‌పై దాడికి య‌త్నం.. ప్ర‌జాపాల‌న స‌భ ఉద్రిక్తం

Teenmar Mallanna | ఆలేరు ప్ర‌జాపాల‌న (Aleru Prajapalana) కార్య‌క్ర‌మంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ట్లేదంటూ కాంగ్రెస్ ఎమ్మ‌ల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ విమ‌ర్శించ‌డంతో అక్క‌డే ఉన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు (Congress Cadre) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక్క‌సారిగా లేచి స్టేజీ మీద‌కు దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

S

News | Published On May 3, 2026, 1.12 pm IST

Teenmar Mallanna | తీన్మార్‌ మ‌ల్ల‌న్న‌పై దాడికి య‌త్నం.. ప్ర‌జాపాల‌న స‌భ ఉద్రిక్తం
Advertisement
  • పార్టీ గుర్తు మీద గెలిచి ప్ర‌భుత్వాన్నే విమ‌ర్శిస్త‌వా అంటూ కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం
  • స్టేజీ మీద‌కు దూసుకెళ్లేందుకు య‌త్నించిన కాంగ్రెస్ శ్రేణులు
  • అడ్డుకున్న పోలీసులు

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్‌: ఆలేరు ప్ర‌జాపాల‌న (Aleru Prajapalana) కార్య‌క్ర‌మంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ట్లేదంటూ కాంగ్రెస్ ఎమ్మ‌ల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ విమ‌ర్శించ‌డంతో అక్క‌డే ఉన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు (Congress Cadre) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్ర‌భుత్వాన్నే విమ‌ర్శ‌స్తున్నావా అంటూ ఆయ‌న‌పై దాడికి యత్నించారు. ఒక్క‌సారిగా లేచి స్టేజీ మీద‌కు దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

వెనుదిరిగిన మ‌ల్ల‌న్న‌..

మ‌ల్ల‌న్న మ‌న పార్టీ వ్య‌క్తి అని.. ఆయ‌న‌ను మాట్లాడనివ్వాల‌ని, ఆయ‌న మ‌న‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తార‌ని స్టేజిపై ఉన్న నాయ‌కులు ఎంత చెప్పినా కార్య‌క‌ర్త‌లు వినిపించుకోలేదు. మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా అంటూ ఊగిపోయారు. మల్లన్న మీద దాడి చేయబోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ల్ల‌న్న కూడా కార్య‌క‌ర్త‌ల‌పై ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేను మాట్లాడేది వినాల‌ని మండిప‌డ్డారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అక్కడి నుండి మల్లన్న వెనుదిరిగారు.

అంత‌కుముందు మ‌ల్ల‌న్న మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు 20 శాతం రాలేద‌ని, 80 శాతం వ‌చ్చాయ‌ని చెప్పారు. అక్క‌డే ఉన్న ఓ నాయ‌కుడు మ‌ల్ల‌న్న చెప్పింది నిజ‌మేన‌ని, ఆయ‌న‌కు మ‌న‌మంతా జై కొట్టాల‌ని కార్య‌క‌ర్త‌లకు సూచించారు. దీంతో వారు శాంతించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యేనే కార్యకర్తలను ఉసిగొల్పి ఉండొచ్చంటూ ప‌లువురు నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement