త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మొయినాబాద్ విందులో ఏ పార్టీ వాళ్లున్నా శిక్షించండి: దాసోజు శ్ర‌వ‌ణ్‌

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌజ్ (Form house) లో శ‌నివారం రాత్రి జరిగిన విందు (party)లో టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ (TDP MP Mahesh Yadav) తో పాటు అన్ని పార్టీల వాళ్లున్నార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (MLC Dasoju sravan) అన్నారు. డ్రగ్స్ (Drugs) దొరికాయని పోలీసులు అంటున్నార‌ని, ఇది నిజమైతే దాన్ని తీవ్రంగా ఖండిసున్నాన‌ని పేర్కొన్నారు.

S

News | Published On Mar 15, 2026, 6.49 pm IST

మొయినాబాద్ విందులో  ఏ పార్టీ వాళ్లున్నా శిక్షించండి: దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement

- మొయినాబాద్‌కు, కేటీఆర్‌కు లింకు పెట్ట‌డం దుర్మార్గం
- శాసనసభ ఆవరణలో డ్రగ్స్ టెస్ట్ పెట్టండి
- బీఆర్ఎస్ నేత‌లం సిద్ధం, కాంగ్రెసోళ్లు సిద్ధ‌మేనా?
- ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌

త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌజ్ (Form house) లో శ‌నివారం రాత్రి జరిగిన విందు (party)లో టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ (TDP MP Mahesh Yadav) తో పాటు అన్ని పార్టీల వాళ్లున్నార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (MLC Dasoju sravan) అన్నారు. డ్రగ్స్ (Drugs) దొరికాయని పోలీసులు అంటున్నార‌ని, ఇది నిజమైతే దాన్ని తీవ్రంగా ఖండిసున్నాన‌ని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి దోషులు ఎంతటివారైనా కఠిన శిక్షలు వేయాలని కోరారు. అయితే విచారణ (Enquiry) పారదర్శకంగా జరగాలని ఆయ‌న చెప్పారు. కేటీఆర్ పై కాంగ్రెస్ సోషల్ మీడియా కావాలని బురద జల్లుతోందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు (PCC President) రేవంత్ సహవాస దోషంతో కేటీఆర్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిప‌డ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి లో ఉండి తన హోదాకు తగ్గట్టు వ్యవహరించడం లేదన్నారు.

కేటీఆర్ ను మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కు లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండుకు సంబంధం అంటగట్టడమే అని ఫైర‌య్యారు. రేవంత్ రెడ్డి ఏ క్లబ్బు లో, పబ్బులో తిరుగుతున్నారో, ఎక్కడ పేకాట ఆడుతున్నారో మేము చెప్పాలా? అని అన్నారు. కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిల్లర విమర్శలు చేయ‌డం కాంగ్రెస్ నేత‌ల‌కే చెల్లింద‌న్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకుందా ? అని ప్ర‌శ్నించారు. చెర్లపల్లిలో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంబై పోలీసులు ప‌ట్టుకున్నార‌ని అప్పుడు ఈ ఈగల్ పోలీసులు ఏం చేశారని ఫైర‌య్యారు. ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం కాదా? 2025లో 2,572 డ్రగ్స్ కేసులు నమోద‌య్యాయి. గంజాయి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. మండలిలో ప్రశ్న అడిగితే 30 శాతం డ్రగ్స్ వినియోగం పెరిగిందని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం గుడ్డి గుర్రం పళ్లు తోముతుందా? డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ కు మేము సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.

సోమ‌వారం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ ఆవరణలో మహేష్ కుమార్ గౌడ్ డ్రగ్స్ టెస్ట్ పెట్టించాల‌ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులందరం డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం. మహేష్ గౌడ్, సీఎం రేవంత్ సిద్ధమా ? బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరం డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధం. ప్రత్యేక స్టాల్స్ పెట్టండి అని స‌వాల్ విసిరారు.

కేటీఆర్ అంటే కాంగ్రెస్ కు భయం..

కేటీఆర్ ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపుతున్నారనే భయంతోనే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. కొండా సురేఖ కేటీఆర్ పై గతంలో అనుచిత ఆరోపణలు చేస్తే కోర్టు అక్షింతలు వేసిందని గుర్తు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పై పిచ్చి ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేతలను కోర్టు లాగుతామ‌ని హెచ్చ‌రించారు. కేసీఆర్ హయాంలో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపామ‌ని వివ‌రించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తామ‌ని, డ్రగ్స్ కు రాజకీయాలను ఆపాదించవద్దని హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement