MLC Dasoju Sravan | బండి సంజయ్ తన భాషతో బీజేపీని బొంద పెడుతుండు : ఎమ్మెల్సీ దాసోజు
MLC Dasoju Sravan | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ తన భాషతో బీజేపీ పార్టీని బొంద పెడుతున్నారని శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ తన భాషతో బీజేపీ పార్టీని బొంద పెడుతున్నారని శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులపై డీజీపీ సీవీ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్‌లో జరిగిన ఉదంతం అత్యంత అమానవీయమైన, రాజ్యాంగ వ్యతిరేక చర్య. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి గూండాలను ప్రేరేపించి కౌశిక్ రెడ్డిపై, కమలాకర్ కార్యాలయంపై మారణాయుధాలతో దాడి చేయించారు. శాంతిభద్రతలు దిగజారాయి.. నిన్నటి పరిస్థితులను చూస్తే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు.. గూండాల పాలన అన్నట్టుగా కనబడింది. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పోలీసులను చెప్పుచేతుల్లో పెట్టకుని దుర్మార్గమైన, రాజ్యాంగ వ్యతిరేక, రాక్షస పాలను చూపిస్తూ వస్తున్నారు. ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
భగవంతుడి దయ వల్ల కౌశిక్ రెడ్డి బతికి ఉన్నాడు..
భగవంతుడి దయ వల్ల కౌశిక్ రెడ్డి బతికి ఉన్నాడు. లేకపోతే ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది. మారణాయుధాలు, పెట్రోల్ బాంబులతో వస్తే కేసులు పెట్టరట. కానీ ప్రశ్నిస్తే కేసులు పెడుతారట. బండి సంజయ్ భాష విన్నారా.. భారత్ మాతాకీ జై అనే నినదించే వారు మాట్లాడే భాషేనా అది. ఇది తప్పు అని కౌశిక్ రెడ్డి అంటే దాడి చేస్తారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని బండి సంజయ్ అంటే.. కౌశిక్ రెడ్డి తంబాకు గురించి ప్రస్తావన చేసిండు.. డ్రగ్స్ అంటే తప్పు లేదట.. కానీ తంబాకు తింటడు అంటే తప్పు ఎట్ల అయితది అని నిలదీశారు.
తప్పుడు ప్రచారం చేయడం రాజకీయమా..?
సంజయ్‌కు సంస్కారం, మర్యాద లేదు.. ఎవర్నీ తిడుతున్నవ్.. ఆ తల్లిని తిడుతున్నవ్. బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా..? ఇలాంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు.. ఇంత అన్యాయమా.. తల్లులను, భార్యలను, పిల్లలను ఎవర్నీ వదిలిపెట్టరు. రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా..? సభ్యత, సంస్కారం లేదా..? ఏది పడితే అది మాట్లాడుతారా..? ఇదేనా రాజకీయం అంటే.. లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారం చేయడం రాజకీయమా..? దమ్ముంటే విద్య మీద చర్చ చేయ్.. ఆరోగ్య పరిస్థితులు, నిరుద్యోగులు, కేంద్ర నిధులపై చర్చ చేయ్.. వడ్లు, మక్కలపై చర్చ చేయ్ అని బండికి శ్రవణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమ్మలను, అయ్యలను తిట్టమని భగవద్గీత చెప్పిందా..?
ఇక బీజేపీ నేతలట తెలంగాణలో జెండా ఎగరేస్తారట.. బండి సంజయ్ తన భాషతో బీజేపీని బొంద పెడుతున్నరు.. బొంద పెట్టుకోండి.. కానీ అమ్మలను, అయ్యలను తిట్టమని భగవద్గీత చెప్పిందా..? భారతం చెప్పిందా..? ఏం సంస్కారం ఇది.. మీరా ధర్మం దేవుళ్ల గురించి మాట్లాడేది. హెచ్చరిస్తున్నా.. నీ విధానం మార్చుకో.. కౌన్సిలర్‌గా గుర్తింపు కోసం ఏదో మాట్లాడినవ్.. ఇవాళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.. భారతదేశ సార్వభౌమాధికారం చేతిలో పెట్టుకుని చిల్లరగాళ్లలా మాట్లాడితే ప్రజలు తాట తీస్తారు.. ప్రజలు బొంద పెట్టే రోజులు వస్తాయని శ్రవణ్ హెచ్చరించారు.
సెటిల్‌మెంట్లకు అడ్డాగా కమాండ్ కంట్రోల్ సెంటర్..
రాష్ట్రంలో సెటిల్‌మెంట్లు చేసుకునే వారికి రక్షణగా ఉంటారు పోలీసులు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్‌లో పోలీసులు లేరు. ఐపీఎస్ భార్య గొంతు కోసి చంపేశారట. పోలీసు వ్యవస్థ అంతా గడ్డి పీకుతుందా..? హోం మంత్రిగా ఉన్న రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుని ఏం చేస్తున్నాడో మీకు తెలుసు.. సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారింది కమాండ్ కంట్రోల్ సెంటర్. సెక్రెటేరియట్ రాకుండా.. సెటిల్‌మెంట్లకు వెళ్తున్నాడు.. 40 మంది పోకిరీలు సీపీని వేధించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. హోం మంత్రిగా మేల్కొను అని సీఎంకు దాసోజు సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ అక్రమ సంబంధం ఏంది..?
బండి సంజయ్‌తో మిత్రుత్వం ఉంటే.. బిర్యానీ తినిపించుకో. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయొద్దు.. కేటీఆర్ మీద కేసు పెడుతవ్.. మరి బండి సంజయ్ మీద ఎందుకు పెట్టవ్.. చుట్టమా బండి సంజయ్ రేవంత్ రెడ్డికి.. బీజేపీ, కాంగ్రెస్ అక్రమ సంబంధం ఏంది..? రాహుల్ గాంధేమో బీజేపీని తిడుతడు.. రేవంత్ రెడ్డెమో మోదీకి పల్లకి మోసినట్టు ఉంది. డీజీపీ గారూ మాకు సహాయం చేయకండి.. రాజ్యాంగాన్ని, శాంతి భద్రతలను కాపాడండి అని దాసోజు శ్రవణ్ కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



