త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్‌తో స‌మావేశ‌మైన అఖిలేష్‌యాద‌వ్‌

KTR | బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌ (KTR) తో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) స‌మావేశ‌మయ్యారు.

A

News | Published On Dec 12, 2025, 8.17 pm IST

KTR | కేటీఆర్‌తో స‌మావేశ‌మైన అఖిలేష్‌యాద‌వ్‌
Advertisement

KTR | న‌గ‌రానికి వ‌చ్చిన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌ (KTR) తో శుక్ర‌వారం స‌మావేశ‌మ‌య్యారు. నందిన‌గ‌ర్‌లోని కేటీఆర్ నివాసానికి వ‌చ్చిన ఆయ‌న బీఆర్ఎస్ నాయ‌కుల‌తో స‌మావేశ‌మై రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న‌ను శాలువాతో స‌త్క‌రించి, ల‌క్ష్మీన‌ర‌సింహస్వామి విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. అనంత‌రం విలేక‌రులతో మాట్లాడిన అఖిలేష్... కేసీఆర్‌, కేటీఆర్ త‌మ స్నేహితుల‌ని, వారితో ఎప్ప‌డూ క‌లిసే ఉంటామ‌ని విలేక‌రులు అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. స‌మావేశంలో మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంక‌టేశ్‌, బండారి ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement