Aeroplane | విమాన ప్రయాణీకులూ.. ఇక సీట్ల ఎంపిక మీ ఇష్టమే
అదనపు చార్జీలతో ఇబ్బంది పడుతున్న విమాన ప్రయాణికుల (Aeroplane passengers) కు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్గదర్శకాలను విడుదల చేసింది.
త్రినేత్ర.న్యూస్: అదనపు చార్జీలతో ఇబ్బంది పడుతున్న విమాన ప్రయాణికుల (Air passengers) కు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. 60 శాతం సీట్లను అదనపు రుసుం లేకుండా (Without additional charges) నే ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రస్తుతం విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్ వేళ ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. టికెట్ ధర కంటే ఫీజు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక నుంచి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ప్రతి విమానంలో 60 శాతం సీట్లు ఉచిత ఎంపిక కేటగిరీలో ఉంచాలి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా ఆయా సంస్థలు ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల అదనపు చార్జీలు చెల్లించే భారం తప్పే అవకాశం ఉంటుంది.
బ్యాగేజీపై విధానాలివే..
బ్యాగేజీపై డీజీసీఏ విధానాలు సూచించింది. స్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి. పెంపుడు జంతువుల రవాణాపై సంస్థలు తమ వెబ్‌సైట్లలో పాలసీని ప్రదర్శించాలి. ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారంపై తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించాలి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






