త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana activists meets TPCC Chief | గరిష్ఠ వయోపరిమితి పెంచండి.. మహేష్ కుమార్ గౌడ్ కు ఉద్య‌మ‌కారుల‌ వినతి

Telangana activists meets TPCC Chief | ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ఠ వయోపరిమితి (Age limit) పెంచాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారులు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ను క‌లిసి విన‌తి ప‌త్రం (Memorandum) స‌మ‌ర్పించారు.

S

News | Published On May 1, 2026, 3.03 pm IST

Telangana activists meets TPCC Chief | గరిష్ఠ వయోపరిమితి పెంచండి.. మహేష్ కుమార్ గౌడ్ కు ఉద్య‌మ‌కారుల‌ వినతి
Advertisement

Telangana activists meets TPCC Chief | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ఠ వయోపరిమితి (Age limit) పెంచాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారులు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ను క‌లిసి విన‌తి ప‌త్రం (Memorandum) స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ప‌రిష్కారానికి త‌గిన చొర‌వ చూపాల‌న్నారు.

వ‌యోప‌రిమితిని 46కు పెంచాల‌ని, ఇందుకు జీవో నెంబరు 30ని కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నేత కొర్రా రవీంద్రనాయక్, సేవా నాయక్ తదితరులు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. కాగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో 30-32 ఏండ్ల వ‌య‌స్సు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల‌కు 37- 40 సంవ‌త్స‌రాలుగా ఉంది.

Advertisement
Advertisement