త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime | సైబ‌ర్ మోసానికి గురై రిటైర్డ్ ఐపీఎస్ ఆత్మ‌హ‌త్య‌

Cyber Crime | సైబ‌ర్ నేర‌గాళ్ల (Cyber Crime) చేతిలో రూ.8.10 కోట్లు మోస‌పోయిన రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి అమర్ సింగ్ చాహల్ (Amar Singh Chahal) గ‌న్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) పాల్ప‌డ్డాడు.

A

News | Published On Dec 23, 2025, 1.26 pm IST

Cyber Crime | సైబ‌ర్ మోసానికి గురై రిటైర్డ్ ఐపీఎస్ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Cyber Crime | సైబ‌ర్ నేర‌గాళ్ల (Cyber Crime) చేతిలో మోస‌పోయిన రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి గ‌న్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు (Suicide) పాల్ప‌డ్డాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న పంజాబ్ (Punjab) రాష్ట్రం ప‌టియాలాలో చోటు చేసుకుంది. 2019లో రిటైర్ అయిన మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) అమర్ సింగ్ చాహల్ (Amar Singh Chahal) సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.8.10 కోట్లు కోల్పోయి తీవ్ర నిరాశలో తనపై తాను కాల్పులు జరిపుకుని, ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న నివాసంలో సెక్యూరిటీ గార్డు ఆయుధంతో ఛాతీలో కాల్పులు జ‌రుపుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోగా, అక్క‌డ 12 పేజీల సూసైడ్ నోట్ ల‌భించింది.

సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్స‌ప్‌, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వెల్త్ ఈక్విటీ అడ్వైజ‌ర్స్‌గా ప‌రిచ‌యం చేసుకున్నారు. తాము డీబీఎస్ బ్యాంక్, దాని సీఈఓతో సంబంధం ఉన్నవాళ్లమని చెప్పి నమ్మకం కలిగించారు. నకిలీ డ్యాష్‌బోర్డ్‌లలో భారీ లాభాలు చూపించి, మరిన్ని పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేశారు. మొదట్లో లాభాలు కనిపించినా, విత్‌డ్రా చేయాలంటే పెద్ద మొత్తంలో సర్వీస్ ఫీ, టాక్స్, ఇతర చార్జీలు చెల్లించమని డిమాండ్ చేసి మరీ కోట్లాది డబ్బు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా దోచుకున్నారు. కానీ ఎలాంటి డబ్బూ తిరిగి రాలేదు. తాను ప్రజలకు మోసాల నుంచి దూరంగా ఉండమని చెప్పేవాడిని, కానీ తానే బలైపోయానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పంజాబ్ డీజీపీ గౌర‌వ్ యాద‌వ్‌కు చేసిన సూచ‌న‌లో ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) లేదా సీబీఐ వంటి సెంట్రల్ ఏజెన్సీ దర్యాప్తు చేయాలని కోరారు. అరెస్టులు, రికవరీలు జరిగితే, త‌న‌ కుటుంబానికి, తాను డబ్బు తీసుకున్నవారికి అప్పులు తీర్చడానికి సహాయం చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement