త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palnadu Superfast Express | గేదెను ఢీకొట్టిన పల్నాడు సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

Palnadu Superfast Express | న‌ల్లగొండ జిల్లాలో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌(Palnadu super fast express)కు పెను ప్రమాదం తప్పింది. తిప్పర్తి (Thipparthi) రైల్వే స్టేష‌న్‌ సమీపంలో గేదెను ఢీకొట్ట(rammed buffalo) గా ఇంజిన్‌లో సమస్య త‌లెత్తింది. దీంతో రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది.

S

News | Published On Apr 9, 2026, 12.26 pm IST

Palnadu Superfast Express | గేదెను ఢీకొట్టిన పల్నాడు సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్లగొండ జిల్లాలో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌(Palnadu super fast express)కు పెను ప్రమాదం తప్పింది. తిప్పర్తి (Thipparthi) రైల్వే స్టేష‌న్‌ సమీపంలో గేదెను ఢీకొట్ట(rammed buffalo) గా ఇంజిన్‌లో సమస్య త‌లెత్తింది. దీంతో రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో నల్లగొండ-మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డ‌గా రైలు ప్రయాణికులు ఇబ్బందులు ప‌డ్డారు. ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవడ‌తో ఇటు రైల్వే అధికారులు, అటు ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవల హనుమ‌కొండ జిల్లాలో సికింద్రాబాద్- హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా భారీ ప్రమాదం తప్పిన విష‌యం విదిత‌మే. ఇంజిన్ చ‌క్రం విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మ‌తులు చేసి ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement