త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | అప్పుల‌ ఊబిలో 91 శాతం రైతు కుటుంబాలు.. త‌ల‌స‌రి రుణం ఎంతంటే?

Telangana | రాష్ట్రంలో (Telangana) రైతు సంక్షేమం కోసం (Farmers) ప్ర‌భుత్వాలు వివిధ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. అప్పులు (Farmer Debts) వారిని వెంటాడుతూనే ఉన్నాయి. వ‌స్తే అతివృష్టి, లేదంటే అనావృష్టితో పంట‌లు స‌రిగ్గా పండ‌క‌, ఒక వేళ పండినా.. స‌రైన గిట్టుబాటు ధ‌ర‌లు లేక అన్న‌దాత‌లు ఆగ‌మై పోతున్నారు.

G

News | Published On Feb 4, 2026, 11.16 am IST

Telangana | అప్పుల‌ ఊబిలో 91 శాతం రైతు కుటుంబాలు.. త‌ల‌స‌రి రుణం ఎంతంటే?
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో (Telangana) రైతు సంక్షేమం కోసం (Farmers) ప్ర‌భుత్వాలు వివిధ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. అప్పులు (Farmer Debts) వారిని వెంటాడుతూనే ఉన్నాయి. వ‌స్తే అతివృష్టి, లేదంటే అనావృష్టితో పంట‌లు స‌రిగ్గా పండ‌క‌, ఒక వేళ పండినా.. స‌రైన గిట్టుబాటు ధ‌ర‌లు లేక అన్న‌దాత‌లు ఆగ‌మై పోతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నా తాము పండించిన పంట‌ను, తాము అనుకున్న ధ‌ర‌కు అమ్ముకోలేక మ‌ధ్య‌ద‌ళారుల చేతుల్లో ప‌డి న‌ష్ట‌పోతున్నారు. ప్ర‌భుత్వాలు రైతుబంధు, రైతు భ‌రోసా, రైతుబీమా ప‌థ‌కం ఏదైతేనేమి ఏదోవిధంగా రైతుల‌కు అండ‌గా ఉంటున్న‌ప్ప‌టికీ.. స‌రైన స‌మ‌యానికి పంట దిగుబ‌డిని సేక‌రించ‌క‌, మార్కెటింగ్ సౌక‌ర్యం క‌ల్పించ‌క, సేక‌రించిన పంట‌కు వెంట‌నే డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డంతో అప్పుల పాల‌వుతున్నారు.

ఇలా రాష్ట్రంలోని అత్య‌ధిక‌ రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయ‌ని సాక్ష్యాత్తు లోక్‌స‌భ వేదికగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సిచ్యుయేషన్‌ ఎసెస్‌మెంట్‌ సర్వే ప్రకారం 2018-19 వ్యవసాయ సీజన్‌లో తెలంగాణలోని 91.7 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్ వెల్ల‌డించారు. ఒక్కో కుటుంబంపై తలసరి రూ.1,52,113 అప్పు ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ కుటుంబ నెల వారీ ఆదాయం రూ.9,403గా ఉన్నద‌ని చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం రూ.10,218 కంటే తక్కువ అని స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement