Rajeev Yuva Vikasam | రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు: భట్టి
Rajeev Yuva Vikasam | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసానికి (Rajeev Yuva Vikasam) రూ. 6 వేల కోట్లు ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM, Finance Minister Bhatti Vikramarka) వెల్లడించారు.
త్రినేత్ర.న్యూస్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసానికి (Rajeev Yuva Vikasam) రూ. 6 వేల కోట్లు ప్రతిపాదించినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM, Finance Minister Bhatti Vikramarka) వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ(Assembly) లో ప్రకటించారు. ఆర్థిక స్వయం సమృద్ధిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన, బలహీన వర్గాలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వివరించారు.
ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2025, మార్చి 17న ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకంలో భాగంగా మూడు కేటగిరీల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.
. రూ. 50,000 వరకు ఖరీదు చేసే యూనిట్లకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీని అందిస్తుంది.
. రూ. 50,001 నుంచి రూ. లక్ష మధ్య ఖరీదు చేసే యూనిట్లకు 90 శాతం, మిగిలిన 10% బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూరుస్తారు.
. రూ.1,00,001 నుంచి రూ.2 లక్షల మధ్య ధర కలిగిన యూనిట్లకు, సబ్సిడీ 80 శాతం, 20 శాతం బ్యాంకు రుణం ఇస్తుంది.
. రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు, ప్రభుత్వం ఖర్చులో 70 శాతం భరిస్తుంది. మిగిలినది బ్యాంకు రుణం ఇస్తుంది.
తాజావార్తలు
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!

Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ





