త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

గుండెపోటుతో మ‌ర‌ణించినా.. ఆ ఊరు ఆమెకే ఓటేసింది.

వార్డు మెంబ‌ర్‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సిన అభ్య‌ర్థి ఎన్నిక జ‌రిగేక‌న్నా ముందే క‌న్నుమూసింది. అయినా ఆ గ్రామ‌స్తులు ఆమెకు నివాళిగా చ‌నిపోయిన ఆమెకే ఓటేసి గెలిపించారు.

a

News | Published On Dec 14, 2025, 9.11 pm IST

గుండెపోటుతో మ‌ర‌ణించినా.. ఆ ఊరు ఆమెకే ఓటేసింది.
Advertisement

గుండెపోటుతో మ‌ర‌ణించినా.. ఆ ఊరు ఆమెకే ఓటేసింది.
త్రినేత్ర.న్యూస్ : వార్డు మెంబ‌ర్‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సిన అభ్య‌ర్థి ఎన్నిక జ‌రిగేక‌న్నా ముందే క‌న్నుమూసింది. అయినా ఆ గ్రామ‌స్తులు ఆమెకు నివాళిగా చ‌నిపోయిన ఆమెకే ఓటేసి గెలిపించారు. రంగారెడ్డి జిల్లా శంక‌ర్ ప‌ల్లి మండ‌లం మాసానిగూడ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఈ అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ప‌ల్లె ల‌త (4) మాసానిగూడ‌లో 8 వార్డు స‌భ్యురాలిగా పోటీ చేస్తున్న‌ది. ఊర్లో ప్ర‌చారం చేస్తూ ఈ నెల 7న (2025 డిసెంబ‌ర్‌) గుండెపోటుతో క‌న్నుమూసింది. ఆ వార్డుకు ఎన్నిక ఆదివారం (2025 డిసెంబ‌ర్ 14) జ‌రిగింది. ఈ ఎన్నిక‌లో ఆమె 30 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. కాగా, ఆ వార్డుకు తిరిగి ఎన్నిక నిర్వ‌హిస్తామంటూ రిట‌ర్నింగ్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement