త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్లకు ప్రాథమిక అర్హుల జాబితా విడుదల.. ఇలా స్టేటస్‌ చెక్‌ చేసుకోండి

Indiramma Illu | ‘క్యూర్‌’ ప్రాంత పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అర్హుల జాబితాను ప్రకటించింది. ఈ పథకం కింద 7,340 ఇళ్లను లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా.. మొత్తం 60,720 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తుదారుల ఆస్తులు, వాహనాలు, సొంత ఇల్లు తదితర వివరాలను అధికారులు పరిశీలించిన అనంతరం.. దాదాపు 40 వేల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు.

P

Hyderabad | Published On Aug 21, 2026, 10.01 pm IST

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్లకు ప్రాథమిక అర్హుల జాబితా విడుదల.. ఇలా స్టేటస్‌ చెక్‌ చేసుకోండి
Advertisement

Indiramma Illu | ‘క్యూర్‌’ ప్రాంత పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అర్హుల జాబితాను ప్రకటించింది. ఈ పథకం కింద 7,340 ఇళ్లను లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా.. మొత్తం 60,720 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తుదారుల ఆస్తులు, వాహనాలు, సొంత ఇల్లు తదితర వివరాలను అధికారులు పరిశీలించిన అనంతరం.. దాదాపు 40 వేల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పరిస్థితిని ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇలా స్టేటస్‌ తెలుసుకోండి..

దరఖాస్తుదారులు tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి.. అప్లికేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌లో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం సంబంధిత వివరాలను నమోదు చేసి సెర్చ్‌ చేస్తే దరఖాస్తుకు సంబంధించిన సమాచారం తెరపై కనిపిస్తుంది. అప్లికేషన్‌ నంబర్‌, దరఖాస్తుదారు పేరు, ప్రాజెక్టు లొకాలిటీతోపాటు ప్రస్తుత స్టేటస్‌ కూడా అక్కడే తెలుసుకోవచ్చు.

అనర్హులైతే ఏం చేయాలి?

దరఖాస్తు స్టేటస్‌లో ‘అనర్హులు’ అని వస్తే.. దాని పక్కనే కనిపించే ‘రెయిజ్‌ క్లెయిమ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దరఖాస్తును తిరస్కరించడానికి అధికారులు పేర్కొన్న కారణం అక్కడ కనిపిస్తుంది. ఆ కారణం వాస్తవం కాదని భావిస్తే.. సంబంధిత వివరాలతో అభ్యంతరం నమోదు చేసుకోవచ్చు. అవసరమైన ఆధారాలను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంది.

ఆగస్టు 23లోపు అభ్యంతరాలు

ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆగస్టు 23 సాయంత్రంలోపు సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 25న తుది అర్హుల జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ విధానంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించనున్నారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 040-24603572 నంబర్‌కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement