Women’s Reservation Act | మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సన్నాహాలు.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లులు పెట్టే యోచన..!
Women's Reservation Act | మహిళా రిజర్వేషన్ (నారీశక్తి వందన్) చట్టం అమలు చేసేందుకు కేంద్రం ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Women's Reservation Act | మహిళా రిజర్వేషన్ (నారీశక్తి వందన్) చట్టం అమలు చేసేందుకు కేంద్రం ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తికాకముందే ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం అమలుపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం నిర్వహించాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వం ఏంటోందంటే..?
నారీశక్తి వందన్ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీయే, కాంగ్రేసేతర ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఏకాభిప్రాయం కుదిరితే ఈ రెండు బిల్లులను ఈ వారంలోనే పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. సమాచారం మేరకు లోక్‌సభలో సీట్ల సంఖ్య 543 ఉండగా.. దీన్ని 816 పెంచాలని భావిస్తున్నారు. ఇందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అయితే, పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. జేడీయూ ఎంపీ లవ్లీ ఆనంద్ ఈ నిర్ణయం ప్రశంసనీయమైందన్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ ప్రగతిని వేగవంతం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీలు ఏమన్నారంటే..
బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్ మాట్లాడుతూ దేశ మహిళలకు ఇచ్చిన వాగ్ధానాన్ని ప్రధాని నెరవేరుస్తున్నారని, గత 11 ఏళ్లుగా మహిళలను సామాజికంగా, ఆర్థికంగా సాధికారత కల్పించే దిశగా ప్రయత్నాలు జరిగాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్ర హసన్ కేంద్రం చొరవను స్వాగతించారు. అయితే, అమలులో స్పష్టత అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారన్నది ముఖ్యమన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై సంతోషంగా ఉన్నామన్నారు.
33శాతం రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టానికి 2023లో ఆమోదం పొందింది. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన అమలులోకి రానుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యంతో 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అంచనా వేశారు. అప్పటి జనగణన, పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎదురుచూడకుండా కేంద్రం ముందస్తుగానే అమలులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
- ●Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..
- ●CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు
- ●Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ - 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్
- ●Mahesh Kumar | సీఎం రేవంత్రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి

MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు





