Woman Kisses CM | ఎన్నికల ప్రచారంలో సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. వైరల్ వీడియో
Woman Kisses CM | అస్సాంలో (Assam) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Woman Kisses CM | త్రినేత్ర.న్యూస్: అస్సాంలో (Assam) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ధెమాజీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో (Woman Kisses CM) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మార్చి 27న ధేమాజీలో (Dhemaji) సీఎం హిమంత ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో మహిళా అభిమానులు పాల్గొన్నారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ హిమంత ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని ఆయనను దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దుపెట్టుకున్నది. ర్యాలీకు భారీగా తరలివచ్చిన మహిళలు భద్రతా వలయాలను దాటుకుని మరీ ఆయనను హత్తుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం, పూల వర్షం కురిపించారు. చాలా మంది మహిళలు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు నవ్వుతూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ తోపులాటలో ముఖ్యమంత్రికి కొన్ని చిన్న గీతలు (గాయాలు) పడ్డాయి.
దీనిపై ఆయన స్పదిస్తూ ఇవి కేవలం గీతలు కావని.. ప్రజలు తనపై చూపిస్తున్న 25 ఏండ్లుగా తనపై వారికి ఉన్న ప్రేమ, ఆశీర్వాదాలకు గుర్తులని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో తనకు ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని తెలిపారు. తల్లుల నుంచి చిన్నారులు, పెద్ద ప్రతిఒక్కరు తనపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని, అది ముద్దుల రూపంలో ప్రతిబింబిస్తున్నదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని, మర్యాదపూర్వకంగా లేదని విమర్శిస్తున్నాయి.
https://x.com/aboyobbhuyan/status/2037783445439701440
https://youtu.be/V0kNpsohQBo?si=415G6aT80X3zJ3yb
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



