Live-In Partner | 40 ఏండ్ల మహిళతో 20 యువకుడి సహజీవనం.. నడిరోడ్డుపై కట్టేసి కొట్టిన పోలీసులు
Live-in Partner | గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో (Bhavnagar) దారుణం జరిగింది. సహజీవన భాగస్వామిని (Live-in Partner) చంపిన నిందితుడిని నడిరోడ్డుపై పోలీసు జీపునకు కట్టేసి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Live-in Partner | త్రినేత్ర.న్యూస్: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో (Bhavnagar) దారుణం జరిగింది. సహజీవన భాగస్వామిని (Live-In Partner) చంపిన నిందితుడిని నడిరోడ్డుపై పోలీసు జీపునకు కట్టేసి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భావ్‌నగర్‌కు చెందిన 20 ఏండ్ల ఫైసల్ (Faisal) అలియాస్ ఖట్కీ లఖానీ.. తనకంటే వయస్సులో 20 ఏండ్లు పెద్దదైన కాజల్‌బెన్ బారైయా (Kajalben Baraiya)తో గత కొన్నేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3న భావ్‌నగర్ బస్టాండ్ వద్ద వారిద్దరు గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన ఫైసల్ ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కాజల్‌బెన్ సెప్టెంబర్ 4న దవాఖానలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం..
దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene Reconstruction) కోసం నిందితుడిని భావ్‌నగర్ బస్టాండ్ వద్దకు తీసుకొచ్చిన పోలీసులు.. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత అతడిని నడిరోడ్డుపై తమ జీపునకు కట్టేశారు. ప్రజలందరూ చూస్తుండగానే లాఠీలతో చితకబాదారు. బస్టాండ్‌లో (Bus Stand) కూడా కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తన స్నేహితుడు రవి గోహిల్‌తో కాజల్‌బెన్ అక్రమ సంబంధం ఉందని ఫైసల్ అనుమానం పెంచుకున్నాడని, ఇదే విషయమై ముగ్గురి మధ్య ఈనెల 3న మధ్యాహ్నం గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. గొడవ కాస్తా పెద్దదై పరస్పరం దాడి చేసుకున్నారని, ఈ క్రమంలో కాజల్‌బెన్‌ను కింద పడేసిన ఫైసల్.. ఆమె తల, శరీర భాగాలపై విచక్షణారహితంగా తన్నడంతో తీవ్ర గాయపడిందని చెప్పారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన రవిపై కూడా దాడిచేశాడని వెల్లడించారు. కాజల్‌బెన్ తల్లి ఫిర్యాదుతో ఫైసల్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
🇮🇳 MAN WHO KILLED A WOMAN BEATEN BY POLICE AT CRIME SCENE
In India, police beat the man with batons after taking him back to the scene to reenact the killing pic.twitter.com/X2BPjFAdvr
— BRICS + World (@BricsPlusWorld) September 5, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం… వీడియోలు
ఆగస్టు 27, 2026

Bihar protests | ప్రధాని మోదీ రాజీనామా చేయాలనే పోస్టర్ పట్టుకున్నాడని.. పాట్నాలో ఆరేండ్ల బాలుడి అరెస్ట్..! వీడియో
ఆగస్టు 26, 2026

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●High Court CJ | 8 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు
- ●Miss World | డొమినిక్ రిపబ్లిక్ భామకు మిస్ వరల్డ్ కిరీటం
- ●BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
- ●బెడ్రూమ్లో ఎక్కువగా వినిపిస్తున్న ‘కేగెల్’.. లైంగిక ఆరోగ్యానికి నిజంగా ఎంతవరకు ఉపయోగం?
- ●సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు
- ●Horoscope | సెప్టెంబర్ 6 రాశిఫలాలు.. అంతుచిక్కని భయాలు, అపోహలు ఉండవచ్చు!

High Court CJ | 8 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు

Miss World | డొమినిక్ రిపబ్లిక్ భామకు మిస్ వరల్డ్ కిరీటం

BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..

బెడ్రూమ్లో ఎక్కువగా వినిపిస్తున్న ‘కేగెల్’.. లైంగిక ఆరోగ్యానికి నిజంగా ఎంతవరకు ఉపయోగం?



