త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Will Uddhav Support Fadnavis | బీఎంసీ మేయర్ పీఠం.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు? మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠం దక్కించుకునే క్రమంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య ఉన్న వైరం సమసిపోయి, మళ్లీ కలయిక సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.

J

National | Published On Jan 19, 2026, 8.32 pm IST

Will Uddhav Support Fadnavis | బీఎంసీ మేయర్ పీఠం.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు? మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!
Advertisement

Will Uddhav Thackeray Support Devendra Fadnavis | త్రినేత్ర.న్యూస్ : దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఫలితాల అనంతరం ఇప్పుడు అందరి దృష్టి మేయర్ పీఠంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది: ముంబైలో అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తారా? అని.

గత కొన్ని ఏళ్లుగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT), బీజేపీ (BJP) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వని పక్షంలో, అధికారం కోసం కొత్త కూటములు అవసరమైన తరుణంలో, ఈ పాత మిత్రులు మళ్లీ కలిసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీ వ్యూహం ఏమిటి?

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ.. ముంబైపై తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం మద్దతు గనుక లభిస్తే అది బీజేపీకి నైతికంగా, సంఖ్యాపరంగా పెద్ద విజయం అవుతుంది.

ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయంపై ఉత్కంఠ

మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే తన సొంత కోటను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) లతో ఉన్న బంధాన్ని తెంచుకుని బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని విశ్లేషకులు చెబుతున్నారు. ముంబై అభివృద్ధి పేరుతో లేదంటే హిందుత్వ ఎజెండాను సాకుగా చూపి ఈ ఇద్దరు నేతలు మళ్లీ దగ్గరయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పుగా మారుతుంది. ప్రస్తుతానికి రెండు పార్టీల నేతలు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తెరవెనుక మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.

జనవరి 22న లాటరీ

జనవరి 22న ముంబై మేయర్ పీఠం కోసం రిజర్వేషన్ లాటరీ ప్రక్రియను అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముంబైతో పాటు రాష్ట్రంలో ఉన్న 29 మెట్రోపాలిటన్ మునిసిపాలిటీలను ఆరోజే లాటరీ ఉంటుంది. లాటరీ ద్వారా రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాతనే మేయర్ పీఠం కోసం అభ్యర్థిని మెజారిటీ ఉన్న పార్టీలు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ముంబై మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement