MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
MBBS | సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) ఎంబీబీఎస్‌లో (MBBS) రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని 71 ఏండ్ల నీట్ (NEET) అభ్యర్థి ప్రశ్నించారు. చదువుకు వయస్సు అడ్డంకి కానప్పుడు తమకు ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదని అశోక్ బహార్ (Ashok Bahar) అనే వృద్ధుడు అలహాబాద్ హైకోర్టులో (Allahabad High Court) పిటిషన్ దాఖలు చేశారు.
MBBS | త్రినేత్ర.న్యూస్: సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) ఎంబీబీఎస్‌లో (MBBS) రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని 71 ఏండ్ల నీట్ (NEET) అభ్యర్థి ప్రశ్నించారు. చదువుకు వయస్సు అడ్డంకి కానప్పుడు, ప్రవేశపరీక్షలు, వైద్య విద్యలో ఇప్పటికే ఇతర వర్గాలకు ప్రయోజనాలు లేదా రిజర్వేషన్లు (Reservation) కల్పిస్తున్నప్పుడు తమకు మాత్రం ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదని అశోక్ బహార్ (Ashok Bahar) అనే వృద్ధుడు అలహాబాద్ హైకోర్టులో (Allahabad High Court) పిటిషన్ దాఖలు చేశారు. అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కోటా (Special Quota) కింద ఎంబీబీఎస్ ప్రవేశాల్లో 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ నెల 21న వాదనలు విననుంది.
నీట్ (NEET) పరీక్ష రాయడానికి వయస్సు అడ్డంకి కానప్పుడు, వైద్య విద్యలో సీటు పొందే విషయంలో సీనియర్ సిటిజన్లకు కూడా సమాన అవకాశం ఉండాలని పేర్కొన్నారు. నీట్ యూజీ (NEET UG)కి గరిష్ట వయోపరిమితిని సుప్రీంకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని బహార్ తరఫు న్యాయవాది పంకజ్ ధీర్ సింగ్ రాణా పిటిషన్‌లో ప్రస్తావించారు. సీనియర్ సిటిజన్లు చట్టబద్ధంగా వైద్య ప్రవేశ పరీక్షకు (Medical Education) హాజరయ్యే అవకాశం ఉన్నప్పుడు, వారికి ప్రవేశాలు కల్పించేలా విధానపరమైన ఏర్పాట్లు కూడా ఉండాలన్నారు.
నిత్య విద్యార్థి..
71 ఏండ్ల అశోక్ బహార్.. లక్నో యూనివర్సిటీ నుంచి వృక్షశాస్త్రం (Botany), జంతుశాస్త్రం (Zoology), కెమిస్ట్రీ (Chemistry)లో బీఎస్సీ పట్టా పొందారు. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, లా (Law), ఎంబీఏ (MBA) కూడా పూర్తి చేశారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశారు. వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్‌గా కొనసాగుతున్నారు.
అయితే డాక్టర్ కావాలనే తన ఐదు దశాబ్దాల ఇప్పటికీ తీరలేదు. తల్లి ప్రోత్సాహంతో 1974లో మొదటిసారిగా మెడిసిన్ ఎంట్రెన్స్ రాశారు. కానీ అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత 2023లో మళ్లీ ప్రయత్నించారు. అయితే పరీక్షా కేంద్రం దూరంగా ఉండటంతో ఆలస్యంగా చేరుకుని ఎగ్జామ్‌కు హాజరుకాలేకపోయారు. అయినా నిరుత్సాహపడకుండా ఈ ఏడాది మేలో నీట్ యూజీకి హాజరయ్యారు. అయినప్పటీకి ఎంబీబీఎస్ చేయాలన్న తన కోరిక తీరకపోవడంతో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక నిబందనలు ఉండాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు





