కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ భాష వివాదం చాలాసార్లు వివాదం అవుతూ వచ్చింది. కన్నడ రాని వాళ్లు చాలా మంది బెంగళూరులో నివసిస్తున్నారు. బెంగళూరు ఐటీ హబ్ కావడంతో ఎక్కువగా నార్త్ నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. వాళ్లకు హిందీ, ఇంగ్లీష్ తప్పితే కన్నడ రాదు. చాలామంది స్థానికులు.. బెంగళూరులో ఉండాలంటే కన్నడ రావాలని, కన్నడ నేర్చుకోవాలని నార్త్ ఇండియన్స్‌ను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వార్తలు తరుచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ యువతి బెంగళూరులో నివసించే వాళ్లు కన్నడ భాష ఎందుకు నేర్చుకోవాలో, ఎందుకు ముఖ్యమో చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ యువతిది ఢిల్లీ. కానీ.. బెంగళూరులో ఉంటోంది. తను ఒక కంటెంట్ క్రియేటర్. పేరు సిమ్రిధి మఖిజా. నాది ఢిల్లీ. నేను ఎందుకు కన్నడ నేర్చుకోవాలి అని ఆ యువతి కూడా అందరిలాగే ముందు అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు వీడియోలో వెల్లడించారు. కన్నడ నేర్చుకోవడం అనేది వాళ్ల సంస్కృతికి ఇచ్చే గౌరవం కన్నడ నేర్చుకోవడం వల్ల మన జీవితం సులభం అవ్వడమే కాదు.. వాళ్ల సంస్కృతికి మనం ఇచ్చే గౌరవం అని వీడియోలో సిమ్రిధి స్పష్టం చేసింది. అయితే.. ఒకరోజు తను నివాసం ఉండే హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉండే ఒక టిఫిన్ హోటల్‌లో జరిగిన అనుభవాన్ని తను ఈసందర్భంగా గుర్తు చేసింది. నేను రెగ్యులర్ గా అక్కడ దోశ తింటాను. ఓ నాలుగు రోజులు అక్కడికి వెళ్లలేదు. ఆ తర్వాత వెళ్లేసరికి ఆ షాపు యజమాని నాలుగు రోజుల నుండి రాలేదు ఎందుకు? అంటూ ఆప్యాయంగా అడిగాడు. నేను పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను అని చెప్పాను. కానీ, ఆ సమాధానం నేను కన్నడలో చెప్పి ఉంటే బాగుండేది. వాళ్ల భాషలో పలకరిస్తే కలిగే ఆనందం వేరు.. అని నాకు అనిపించింది అని సిమ్రిధి వీడియోలో వ్యాఖ్యానించింది. కన్నడిగులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు ఈ వీడియోను తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. కన్నడ ప్రజలు కూడా ఆ వీడియోను చూసి మెచ్చుకుంటుంటున్నారు. చివరికి ఎవరో ఒకరైనా కరెక్ట్ గా మాట్లాడారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, కన్నడిగులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.. వాళ్ల భాషను గౌరవిస్తే చాలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. భాష నేర్చుకోవడం అనేది తప్పనిసరి కాకపోవచ్చు కానీ మన జీవనశైలి మెరుగుపడాలంటే మాత్రం భాష నేర్చుకోవాల్సిందే.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by @simridhimakhija